రెండు బైకులు ఢీ.. తండ్రి, కొడుకు స్పాట్ డెడ్

కరీంనగర్‌(Karimnagar)లో ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) చోటుచేసుకుంది. రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్నాయి.

Update: 2025-03-21 14:58 GMT
రెండు బైకులు ఢీ.. తండ్రి, కొడుకు స్పాట్ డెడ్
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: కరీంనగర్‌(Karimnagar)లో ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) చోటుచేసుకుంది. రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో తండ్రి, కొడుకు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరికొందరికి గాయాలు అయ్యాయి. ఈ ఘటన శంకరపట్నం(Shankarapatnam) మండల కేంద్రానికి సమీపంలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు.. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతులను, చికిత్స నిమిత్తం క్షతగాత్రులను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతులు తండ్రి అజీమ్(35), కుమారుడు రెహమాన్‌(11) మక్తా గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News