అల్లుడిని హతమార్చిన మామ, బావమర్ది

భార్య, భర్త మధ్య గొడవ భర్త చావుకు కారణమైన ఘటన కన్నెపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

Update: 2025-03-21 14:51 GMT
అల్లుడిని హతమార్చిన మామ, బావమర్ది
  • whatsapp icon

దిశ, కన్నెపల్లి : భార్య, భర్త మధ్య గొడవ భర్త చావుకు కారణమైన ఘటన కన్నెపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కన్నెపల్లి ఎస్సై గంగారం తెలిపిన సమాచారం మేరకు వెంకటాపూర్ గ్రామంలో చదువుల లక్ష్మణ్ (35) అతని భార్య రోజా (సమత) ఇద్దరు పిల్లలతో జీవనం సాగిస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం భార్యాభర్తల మధ్య గొడవ జరుగుతున్న క్రమంలో అదే గ్రామంలో ఉంటున్న లక్ష్మణ్ మామ పార్వతి రాజన్న, అతని బావమర్ధి అనిల్ వారి మధ్యలో కలుగజేసుకొని క్షణికావేశంలో తమ ఇంటి ఆడపడుచుని ఎందుకు కొడుతున్నావని ప్రశ్నించారు. అనంతరం వారు లక్ష్మణ్ ని ఎత్తి కిందపడేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి అన్న చదువుల శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని తాండూరు సీఐ కుమారస్వామి, ఎస్సై గంగారం తెలిపారు. 


Similar News