స్కూల్ వ్యాన్ ఢీకొని వ్యక్తి దుర్మరణం
స్కూల్ వ్యాన్ ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలో చోటు చేసుకుంది.

దిశ, సైదాపూర్ : స్కూల్ వ్యాన్ ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం సైదాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని బొత్తలపల్లి గ్రామ మూల మలుపు వద్ద హుజురాబాద్ కేరళ ఇంగ్లీష్ మోడల్ స్కూల్ కు చెందిన స్కూల్ వ్యాన్ ద్విచక్ర వాహనంపై వస్తున్న పెర్కపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని గొల్లగూడెం గ్రామానికి చెందిన మర్రి సదానందం (44) అనే వ్యక్తిని ఢీకొట్టింది.
దాంతో తీవ్ర గాయాలు కాగా స్థానికులు 108కు, స్థానిక పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వడంతో తక్షణమే ఏఎస్ఐ మల్లారెడ్డి, బ్లూ కోర్ట్ పోలీస్లు ఆంజనేయులు, రాజు, అశోక్ అజయ్ సంఘటనా స్థలానికి చేరుకొని హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. కేరళ స్కూల్ వ్యానును, డ్రైవర్ స్వామిని అదుపులోకి తీసుకున్నారు. మృతిని కుటుంబానికి కేరళ స్కూల్ యాజమాన్యం తగిన న్యాయం చేయాలని బీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు బత్తుల లక్ష్మీనారాయణ, మాజీ ఎంపీటీసీలు మిట్టపల్లి కిష్టయ్య, మండల కొమురయ్య, పెరికపల్లి బీఆర్ ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు పిల్లి కొమురయ్య, సీనియర్ నాయకులు మాదం స్వామి కోరారు.