దైవ దర్శనానికి వెళ్లి వచ్చేసరికి ఇళ్లు గుల్ల..

నాగర్ కర్నూల్ జిల్లా, బిజినేపల్లి మండలం, లట్టుపల్లి గ్రామంలో గుర్తుతెలియని దొంగలు బీభత్సం సృష్టించారు.

Update: 2025-03-15 15:52 GMT

దిశ, బిజినేపల్లి : నాగర్ కర్నూల్ జిల్లా, బిజినేపల్లి మండలం, లట్టుపల్లి గ్రామంలో గుర్తుతెలియని దొంగలు బీభత్సం సృష్టించారు. స్థానికులు, కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం లట్టుపల్లి గ్రామానికి చెందిన మిర్యాల కృష్ణమోహన్ తన కుటుంబ సభ్యులతో మంత్రాలయం వెళ్లారు. దీంతో శుక్రవారం రాత్రి ఎవరూ లేని సమయంలో దొంగలు ఇంట్లోకి వెళ్లి బట్టలు చిందరవందర చేసి బీరువాలో ఉన్న 8 తులాల బంగారంతో పాటు రూ. 70,000 నగదు ఎత్తుకెళ్లడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ విషయం పై 100 డయల్ తో పోలీసులకు సమాచారం ఇచ్చామని కుటుంబీకులు తెలిపారు.


Similar News