19 మంది పేకాటరాయుళ్ల అరెస్ట్.. వారిలో ఎక్కువ మంది ఆ ఫీల్డ్ వారే..

యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం పోలీసులు 19 మంది పేకాటరాయుళ్లను శుక్రవారం అరెస్టు చేశారు.

Update: 2025-03-15 16:35 GMT

దిశ, యాదాద్రి కలెక్టరేట్ : యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం పోలీసులు 19 మంది పేకాటరాయుళ్లను శుక్రవారం అరెస్టు చేశారు. బొమ్మల రామారం ఎస్సై శుక్రవారం మధ్యాహ్నం విశ్వసనీయ సమాచారం మేరకు బొమ్మలరామారం మండలంలోని మర్యాల గ్రామ శివారులో మామిడి తోటలో పేకాట స్థావరం పై రైడ్ చేశారు. 19 మంది పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ఎక్కువ మంది జర్నలిస్టులు, ప్రముఖ పార్టీల నాయకులు ఉన్నారు. ఈ పేకాట ఆడుతున్న మామిడి తోట ఒక జర్నలిస్టు యూనియన్ నాయకునికి చెందినది కావడం గమనార్హం.

బొమ్మలరామారం ఎస్సై బుగ్గ శ్రీశైలం తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని మర్యాల గ్రామ శివారులో ఉన్న గుండు ముత్తయ్య మామిడి తోటలో తనిఖీ చేయగా హైదరాబాద్, యాదగిరిగుట్టకు చెందిన 1) గుండు ముత్తయ్య, 2) కళ్ళెం కృష్ణ, 3) లింగాల సతీష్, 4 ) ఆరే వెంకటేశ్, 5) చెదుడుపు రాజు, 6) లింగాల సుధాకర్, 7) కంసాని రాము, 8) డీకొండ శ్రీకాంత్, 9) సూదగాని గోపాల్, 10) గడ్డమీది శివలింగం, 11) జగిని విజయ్, 12) గొర్ల నవీన్, 13) గంధం భాను చందర్, 14) పింజరం దినేష్, 15) చుంచు చంద్రమౌళి, 16) బద్దుల మురళి, 17) గందమల్ల మనోజ్, 18) MD. జమాల్, 19) చీర సత్యనారాయణ మొత్తం 19 మంది వ్యక్తులు డబ్బులు పెట్టి మూడుముక్కల పైగా ఆట ఆడుతుండగా పట్టుకోవడం జరిగింది. పేకాట ఆడుతున్న వారి వద్ద నుండి ఆరు బండిళ్ల పేక ముక్కలు, వారి సెల్ ఫోన్లు రూ.81,290ల నగదు స్వాధీనం చేసుకున్నారు. వారి పై కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నామని ఎస్సై ఒక ప్రకటనలో తెలిపారు.

Read More..

దేశాభివృద్ధే బీజేపీ లక్ష్యం.. డీకే అరుణ 


Similar News