భైంసాలో విషాదం.. 8వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య
నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని పూలే నగర్ లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న కదం కోమల్ (14) అనే బాలిక తన ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొని మృతి చెందింది.
దిశ,భైంసా : నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని పూలే నగర్ లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న కదం కోమల్ (14) అనే బాలిక తన ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొని మృతి చెందింది. ఈ ఘటన ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం డెడ్ బాడీని భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు.