చూశారా.. వీళ్ళకు వేరే ఆప్షన్ లేదంట.. వీసీ సజ్జనార్ సంచలన వీడియో
టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ లపై ఉక్కుపాదం మొపుతున్నారు.

దిశ, వెబ్ డెస్క్: టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ (TGSRTC MD VC Sajanar) బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ (Betting Apps Promotion) లపై ఉక్కుపాదం మొపుతున్నారు. ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్లను నిలిపివేసేందుకు ఆన్‌లైన్ లో ఉద్యమం (Online Revolution) సైతం మొదలు పెట్టారు. సేనోటుబెట్టింగ్‌యాప్స్ (SayNoToBettingApps) అంటూ చేపట్టిన ఈ ఉద్యమానికి పలువురు ప్రముఖులు, సినీ ఆర్టిస్టులు (Cinema Artists), సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయేన్సర్లు (Social Media Influencers) మద్దతు తెలుపుతున్నారు. బెట్టింగ్ ప్రమోషన్లను నమ్మకండి.. ప్రమోట్ చేయకండి అని వీడియోలు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దీంతో బెట్టింగ్ యాప్ ప్రమోషన్లు చేస్తున్న కొందరు సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయేన్సర్లపై కేసులు కూడా నమోదు అయ్యాయి.
అయితే ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ల గురించి భయ్యా సన్నీ యాదవ్ అనే సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయేన్సర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేసిన సజ్జనార్.. పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియోపై ఆయన.. చూశారా, వీళ్ళు మనుగడ సాగించేందుకు వేరే ఆప్షన్ లేదంట.. బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేయడం ఒక్కటే మార్గమట అని తెలిపారు. అలాగే మీ జీవితాలను బాగు చేసుకునేందుకు ఎంతో మంది జీవితాలను సర్వనాశనం చేయడం ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. ఎందరో బెట్టింగ్‌కు బానిసలై ఆత్మహత్యలు చేసుకోవడం మీకు కనిపించడం లేదా.. కండ్లుడి కూడా చూడలేకపోతున్నారా? అని మండిపడ్డారు. యూట్యూబ్ (YouTube) లో వ్యూస్ (Views) తగ్గి డబ్బులు రాకపోతే ఫాలోవర్స్ (Followers) ని మోసం చేస్తారా? అంటై వీళ్లకు వ్యూస్ ద్వారా వచ్చే డబ్బే ముఖ్యమని, డబ్బు కోసం ఏమైనా చేస్తారని వ్యాఖ్యానించారు. అందుకే అభిమానంతో ఫాలో అవుతున్న ఎంతో మందిని బెట్టింగ్ కు బానిసలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారని సజ్జనార్ రాసుకొచ్చారు.