Seethakka: రాష్ట్రాలకు మూటలు మోసిందే నువ్వు.. కేటీఆర్‌కు మంత్రి సీతక్క కౌంటర్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర బడ్జెట్‌ ఉద్దేశించి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.

Update: 2025-03-19 08:31 GMT
Seethakka: రాష్ట్రాలకు మూటలు మోసిందే నువ్వు.. కేటీఆర్‌కు మంత్రి సీతక్క కౌంటర్
  • whatsapp icon

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) రాష్ట్ర బడ్జెట్‌‌ను ఉద్దేశించి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌కు (Minister Seethakka) మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు. ఇవాళ అసెంబ్లీ లాబీలో మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ఢిల్లీకి మూటలు మోసే బడ్జెట్ అని కేటీఆర్ వ్యాఖ్యలు చేయడం ఆయన మానసిక పరిస్థితికి అద్దం పడుతున్నాయని విమర్శించారు. ఇతర రాష్ట్రాలకు మూటలు మోసింది కేటీఆర్ అని, కేసీఆర్ (KCR) మూటలు తీసుకున్న వారంతా ఆగం అయ్యారని ఆరోపించారు. అప్పుల గురించి కేటీఆర్ మాట్లాడడం మిలినీయం జోక్ అని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని మోయలేనంత అప్పుల కుప్పగా మార్చింది టీఆర్ఎస్ ప్రభుత్వమన్నారు. బీఆర్ఎస్ బడ్జెట్ అంతా కోతల బడ్జెట్.. అందుకే ప్రజలు వాతలు పెట్టారన్నారు. ఇది బీఆర్ఎస్ మాదిరి అహో ఓహో భజన బడ్జెట్ కాదన్నారు. మహిళా, రైతు, యువత, అట్టడుగు వర్గాల సంక్షేమ బడ్జెట్ ఇదన్నారు. 100% ఇది వాస్తవిక బడ్జెట్ అని, వాస్తవాలను ప్రతిబింబించే విధంగా బడ్జెట్ ఉందన్నారు.

ఆరు గ్యారెంటీలకే అధిక ప్రాధాన్యం

సాంఘీక సంక్షేమ శాఖ తర్వాత పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కి అధిక నిధులు కేటాయించామన్నారు. గుంట భూమి లేని ఉపాధి కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద 600 కోట్ల బడ్జెట్ కేటాయించామన్నారు. మహిళా శ్రేయస్సు ను దృష్టిలో ఉంచుకుని ఎక్కువ నిధుల కేటాయింపు జరిగిందన్నారు. ఆర్థిక ఒత్తిడిలో ఉన్నా ఆరు గ్యారెంటీలకు అధిక ప్రాధాన్యతనిచ్చామని వెల్లడించారు. ఆర్థిక అవకాశాలు, ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని రూపొందించిన సమగ్ర బడ్జెట్ ఇదన్నారు. 100% మహిళా సంక్షేమానికి పెద్ద పీట వేసిన బడ్జెట్ అని, ఇందిరా మహిళా శక్తి పథకాన్ని మరింత బలోపేతం చేసే దిశలో, మహిళలకు మరిన్ని వ్యాపార అవకాశాలు కల్పించేలా ఈ బడ్జెట్ ఉందన్నారు. సబ్బండ వర్గాల సమగ్ర అభివృద్ధి, సామాన్యుల సంక్షేమం, సామాజిక న్యాయానికి అద్దం పట్టేలా తెలంగాణ బడ్జెట్ ఉందని చెప్పారు.


Read More..

తెలంగాణ వార్షిక బడ్జెట్‌పై మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు 

గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్‌కి టూలెట్ బోర్డు.. మాజీసీఎం తీరుపై సర్వత్రా విమర్శలు  

Tags:    

Similar News