విద్యుత్ ఛార్జీల పెంపుపై TGSPDCL సీఎండీ కీలక ప్రకటన

వేసవి కాలం ప్రారంభం కావడంతో తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో ఎండలు దంచి కొడుతుండటంతో ఏసీలు, కూలర్ల వాడకం పెరిగిపోయింది.

Update: 2025-03-21 08:26 GMT
విద్యుత్ ఛార్జీల పెంపుపై TGSPDCL సీఎండీ కీలక ప్రకటన
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: వేసవి కాలం ప్రారంభం కావడంతో తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో ఎండలు దంచి కొడుతుండటంతో ఏసీలు, కూలర్ల వాడకం పెరిగిపోయింది. దీంతో హైదరాబాద్ నగరంతో పాటు, రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ (Electricity demand) భారీగా పెరిగిపోయింది. అయితే గత కొద్ది రోజులుగా విద్యుత్ ఛార్జీలు పెంపుదలకు (Electricity charges increase) విద్యుత్ సంస్థలు నిర్ణయం (Decision of power companies) తీసుకున్నాయని త్వరలోనే ఈ ప్రతిపాదనలను సీఎం (CM)కు ముందు ఉంచుతాయని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తలపై TGSPDCL సీఎండీ ముషారఫ్ ఫారూఖీ స్పందించారు.

ఈ సంవత్సరంలో విద్యుత్ చార్జీల పెంపునకు (Increase in electricity charges) ఎటువంటి ప్రతిపాధనలు చేయడం లేదని ఈ రోజు విద్యుత్ నియంత్రణ భవన్లో ఈఆర్ర్సీ చైర్మన్ (Chairman of the ERC) అధ్యక్షతన జరిగిన విచారణ కార్యక్రమంలో చెప్పుకొచ్చారు. టీజీపీఎస్సీ డీసీఎల్ (TGPSC DCL) ఆదాయ ఆవశ్యకత, రిటైల్ సరఫరా ప్రతిపాదనలపై ఈ విచారణ జరగ్గా.. సీఎండీ, జేఎండీ శ్రీనివాస్ లు హాజరైనట్లు తెలుస్తుంది. కాగా విద్యుత్ ఛార్జీల పెంపుపై ఎటువంటి ప్రతిపాదనలు చేయడం లేదని గురువారం ఎన్పీడీసీఎల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా విద్యుత్ సంస్థల నిర్ణయంతో ఈ ఏడాది విద్యుత్ ఛార్జీల్లో పెరుగుదల లేకపోవడం సామాన్య ప్రజలపై భారం తగ్గించనుంది.

Similar News