జగిత్యాల జిల్లాలో దారుణం.. వ్యక్తిని హతమార్చిన కుటుంబ సభ్యులు

ఓ వ్యక్తిపై భార్యతో పాటు కుటుంబ సభ్యులు పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన జగిత్యాల జిల్లాలో సంచలనంగా మారింది.

Update: 2025-03-15 15:51 GMT

దిశ, జగిత్యాల రూరల్ : ఓ వ్యక్తిపై భార్యతో పాటు కుటుంబ సభ్యులు పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన జగిత్యాల జిల్లాలో సంచలనంగా మారింది. పోలీస్ లు తెలిపిన వివరాల ప్రకారం జగిత్యాల రూరల్ మండలం పొలాస గ్రామంలో పడాల కమలాకర్ పై భార్య, కుటుంబ సభ్యులు పెట్రోల్ పోసి నిప్పు అంటించారు. కాగా కమలాకర్ కు ఇదివరకే సొంత అక్కా చెల్లెళ్లు అయిన ఇద్దరు భార్యలు ఉండగా మరో మహిళను ఇటీవల వివాహం చేసుకొని పొలాసలో ఉంటున్నాడు.

    ఈ రోజు ఉదయం మొదటి భార్య జమున, ఇద్దరు కొడుకులైన పడాల చిరంజీవి, పడాల రంజిత్, కూతురు శిరీష, అల్లుడు శోభన్ బాబు కలిసి కమలాకర్ తో ఆస్తి విషయంలో గొడవకు దిగారు. కత్తి తో దాడి చేసి పెట్రోల్ పోసి నిప్పంటించగా తీవ్ర గాయాలైన కమలాకర్ ను చికిత్స నిమిత్తం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై సుధాకర్ తెలిపారు.

Read Also..

చేపలు పడుతుండగా కరెంట్ షాక్.. వ్యక్తి మృతి 


Similar News