సీబీఐ పోలీస్ అంటూ ఓ వృద్ధుడికి 2.88 కోట్ల టోకరా..

84 వయస్సు గల వ్యక్తిని రూ. 68 కోట్ల ఆర్థిక నేరం లో

Update: 2024-10-23 15:36 GMT

దిశ, సిటీ క్రైమ్ : 84 వయస్సు గల వ్యక్తిని రూ. 68 కోట్ల ఆర్థిక నేరం లో ఉన్నావంటు భయపెట్టించి సైబర్ మోసగాళ్లు 2.88 కోట్లు దోచుకున్నారు. సైబర్ క్రైమ్ కేసులో హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు రూ. 1.56 కోట్లు రికవరీ చేసి బాధితుడి ఖాతా కు తిరిగి చేరేలా చేశారు. బుధవారం పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.... హైదరాబాద్ కు చెందిన 84 సంవత్సరాల వృద్ధుడికి వాట్సాప్ కాల్ వచ్చింది. కాల్ ఎత్తగానే తాము సీబీఐ అధికారులమని, మీరు రూ. 68 కోట్ల ఆర్థిక నేరానికి పాల్పడ్డారని చెప్పి కలవర పెట్టారు. మీరు ఈ కేసు నుంచి బయట పడాలంటే తాము చెప్పినట్లు చేయాలని చెప్పి రూ. 2.88 కోట్లను సైబర్ నేరగాళ్లు వారి ఖాతాలకు బదిలీ చేసుకున్నారు.

ఇది మోసమని గుర్తించి వృద్ధుడు వెంటనే 1930 కు ఫిర్యాదు చేశాడు. హైదరాబాద్ సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు వెంటనే బదిలీ అయ్యిన ఖాతా లలోని దాదాపు రూ. 1.56 కోట్లు జప్తు చేసి వాటిని తిరిగి బాధితుడి ఖాతాలోకి చేశారు. ఫోన్ కాల్స్ చేసి పోలీస్, సీబీఐ, ఇంకా ఇతర దర్యాప్తు అధికారులమని చెప్పి కేసులు అంటూ బెదిరించడానికి ప్రయత్నించి డబ్బులు అడిగినా, ఖాతాలకు బదిలీ చేయాలని అడిగినా అది సైబర్ నేరగాళ్ల పని అని పసిగట్టి వెంటనే ఆ కాల్ కట్ చేయాలని, ఆ ఫోన్ నెంబర్ ని బ్లాక్ చేయాలని పోలీసులు కోరుతున్నారు.


Similar News