దాడి కేసులో వ్యక్తికి రెండేళ్లు జైలు శిక్ష

ఇంటి గోడ విషయంలో దాడి చేసిన వ్యక్తికి రెండు సంవత్సరాల జైలు శిక్ష, 2000 రూపాయల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి జ్యోతిర్మయి తీర్పు వెల్లడించినట్లు చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు.

Update: 2024-10-23 16:19 GMT

దిశ, చందుర్తి : ఇంటి గోడ విషయంలో దాడి చేసిన వ్యక్తికి రెండు సంవత్సరాల జైలు శిక్ష, 2000 రూపాయల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి జ్యోతిర్మయి తీర్పు వెల్లడించినట్లు చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ చందుర్తి మండలం ఆశిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన బొజ్జ గట్టు వసంతకు, అదే గ్రామానికి చెందిన బొజ్జ గట్టు మోహన్ కు ఇంటి పక్కన ఉన్న భూమి విషయంలో గొడవలు జరిగాయి. దాంతో 8 నెల 2014న వసంత ఇంటికి వెళ్లే దారికి అడ్డంగా మోహన్ గోడ నిర్మిస్తుండగా అడ్డుకున్న ఆమెను బూతులు తిట్టి కొట్టగా కుడి వేలు విరిగింది.

    దాంతో ఆమె చందుర్తి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. అప్పటి ఎస్ఐ ప్రతాప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి కోర్ట్ లో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ప్రాసిక్యూషన్ తరువున పీపీ విక్రాంత్ వాదించగా ఎస్ఐ రవీంద్రనాయుడు ఆధ్వర్యంలో కోర్ట్ కానిస్టేబుల్ తిరుపతి , కానిస్టేబుల్ మధుసూదన్ సాక్షులను ప్రవేశపెట్టారు. కేసు పూర్వాపరాలను పరిశీలించిన న్యాయమూర్తి జ్యోతిర్మయి నేరం రుజువు కావడంతో నిందితుడు బొజ్జ గట్టు మోహన్ కు రెండు సంవత్సరాల జైలు శిక్ష ,రెండు వేల రూపాయలు జరిమానా విధించినట్లు చందుర్తి సీఐ తెలిపారు.

Tags:    

Similar News