డ్రగ్స్ విక్రయిస్తున్న ముఠా అరెస్ట్
రాజస్థాన్ నుంచి దమ్మాయిగూడ మున్సిపాలిటీలోని బండ్లగూడకు డ్రగ్స్ విక్రయిస్తున్న ముఠాను ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు.
దిశ, కీసర : రాజస్థాన్ నుంచి దమ్మాయిగూడ మున్సిపాలిటీలోని బండ్లగూడకు డ్రగ్స్ విక్రయిస్తున్న ముఠాను ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. బండ్లగూడలోని ఇతర రాష్టాలకు చెందిన నలుగులు వ్యక్తులు అక్రమ సంపాదనే లక్ష్యంగా చేసుకొని విక్రయాలు సాగిస్తున్నట్లు సమాచారం అందుకున్న ఎస్ఓటీ పోలీసులు సోదాలు నిర్వహించారు. ఇద్దరు వ్యక్తులు పరారీలో ఉండగా ఇద్దరి వ్యక్తులను అరెస్ట్ చేశారు.
కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని దమ్మాయిగూడ మున్సిపల్ పరిధిలోని బండ్లగూడలో 10 గ్రాముల డ్రగ్స్ ను ఎస్ఓటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మేడ్చల్ జిల్లా కీసర మండలం బండ్లగూడలోని ఠాకూర్ పరదాం కాలనీలోని ఓ నివాస గృహంలో డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఇద్దరు పరారీలో ఉన్నారు. నిందితుల్లో ముగ్గురు రాజస్థాన్, ఒకరు అహ్మదాబాద్‌లోని ఓధవ్ కి చెందిన వారుగా కీసర సీఐ వెంకటయ్య తెలిపారు. నిందితుల నుంచి 10 గ్రాముల హెరాయిన్, తిరుపతి కొరియర్ ఖాళీ కవర్, బైక్, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.