యూట్యూబర్ పై కేసు నమోదు

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో రెండు పార్టీల మధ్య విధ్వేషాలు సృష్టించే విధంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన యూట్యూబర్ పై కేసు నమోదైంది.

Update: 2024-10-23 16:06 GMT

దిశ,బెల్లంపల్లి : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో రెండు పార్టీల మధ్య విధ్వేషాలు సృష్టించే విధంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన యూట్యూబర్ పై కేసు నమోదైంది. బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం బెల్లంపల్లి మండలం బట్వాన్ పల్లి గ్రామంలో సింగతి నరేందర్, సింగతి మల్లేశంల మధ్య జరిగిన భూమి తగాదాపై ఒకరినొకరు కొట్టుకొని తాళ్లగురిజాల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసుకున్నారు. పోలీసులు ఇద్దరిపై కేసులు నమోదు చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సింగతి నరేందర్ యూట్యూబ్, ఫేస్ బుక్ లలో అప్లోడ్ చేశాడు.

     వరంగల్ జిల్లా ధర్మసాగర్ కు చెందిన యూ ట్యూబర్ చిలుక ప్రవీణ్ కుమార్ సంఘటనను వక్రీకరించి రెండు వర్గాలు, రెండు రాజకీయ పార్టీల మధ్య విధ్వేషాలు పెంచే విధంగా ట్విట్టర్​, ఫేస్​బుక్​లో తిరిగి పోస్ట్ చేశాడు. బీఆర్ ఎస్ పార్టీ కి ఓటు వేసినందుకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నరేందర్ పై గొడ్డలితో దాడి చేశారని తప్పుడు సమాచారాన్ని అందించాడు. దాంతో చిలుక ప్రవీణ్ కుమార్ పై తాళ్ల గురిజాల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసి రెండు వర్గాల మధ్య సోషల్ మీడియాలలో విధ్వేషాలు సృష్టిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీపీ హెచ్చరించారు. 

Tags:    

Similar News