ముంబైలో దారుణం.. హోంవర్క్ చేయలేదని కొట్టిన ట్యూషన్ టీచర్.. చావుబతుకుల మధ్య బాలిక
మహారాష్ట్ర రాజధాని ముంబైలో దారుణం చోటు చేసుకుంది.
దిశ, వెబ్ డెస్క్ : మహారాష్ట్ర రాజధాని ముంబైలో దారుణం చోటు చేసుకుంది. హోంవర్క్ చేయలేదని ట్యూషన్ టీచర్ కొట్టడంతో ఓ బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆ చిన్నారి ప్రైవేట్ ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య పోరాడుతోంది. అక్టోబర్ 5న నల్లసోపరా ప్రాంతానికి చెందిన తొమ్మిదేళ్ల బాలిక ట్యూషన్‌కు వెళ్లింది. అయితే హోంవర్క్ చేయకపోగా, అల్లరి కూడా చేస్తుండటంతో ట్యూషన్ టీచర్ రత్నా సింగ్ ఆ పాప చెంపపై రెండుసార్లు గట్టిగా కొట్టింది. ఆ దెబ్బకు చెవి రింగు ఆమె బుగ్గలోకి దిగి, మెదడుకు తీవ్ర గాయం అయింది. తల్లిదండ్రులు ఆమెను ముందుగా స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అక్కడ ఆరోగ్యం మరింతగా క్షీణించడంతో ముంబైలోని ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. పది రోజులుగా బాలికను వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నప్పటికీ.. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నదని డాక్టర్లు తెలిపారు. మరోవైపు బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసుల ట్యూషన్ టీచర్‌పై కేసు నమోదు చేశారు.