భర్తను నిలదీసిన భార్య.. కనిపించకుండా పోయిన భర్త
మరొక మహిళతో అక్రమ సంబంధం పై భార్య నిలదీయడంతో భర్త
దిశ, బడంగ్ పేట్ : మరొక మహిళతో అక్రమ సంబంధం పై భార్య నిలదీయడంతో భర్త కనిపించకుండా ఘటన బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బాలాపూర్ ఇన్స్పెక్టర్ సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం... షాహీన్ నగర్ తయ్యబ్ కాలనీ కి చెందిన షేక్ ఎజాజ్ (45)కు నజ్మాబేగం తో 14 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఆరుగురు సంతానం. మూడు నెలల క్రితం షేక్ ఎజాజ్ మరొక మహిళ తో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని భార్య గొడవకు దిగింది. ఈ నెల 21 వ తేదీన మరోసారి భర్తతో భార్య గొడవకు దిగింది. దీంతో తన మొబైల్ ఫోన్ ను ఇంట్లో నే పెట్టి ఎవ్వరికి చెప్పకుండా వెళ్ళిపోయాడు. దీంతో భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాలాపూర్ పోలీసులు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.