దిశ, వెబ్ డెస్క్ : సికింద్రాబాద్(Secundrabad) లోని పాఠశాలలో విషాద ఘటన చోటు చేసుకుంది. మధ్యాహ్న భోజనంలో చపాతీ రోల్ గొంతులో ఇరుక్కుని(Cholking) ఒక విద్యార్థి మరణించాడు. సికింద్రాబాద్ లో ఓ ప్రైవేట్ పాఠశాలలో విరన్ జైన్ అనే విద్యార్థి ఆరో తరగతి చదువుతున్నాడు. లంచ్ సమయంలో చపాతీ రోల్ తింటుండగా అది గొంతులో ఇరుక్కుపోవడంతో ఊపిరి ఆడలేదు. అప్రమత్తమైన స్కూల్ యాజమాన్యం వెంటనే బాలున్ని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆ విద్యార్థి మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న తమ కుమారుడు మరణించాడన్న వార్తతో వారి కుటుంబం శోక సముద్రంలో మునిగిపోయింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.