మెదక్ జిల్లా ఎస్ఐపై హెచ్ఆర్సీలో ఫిర్యాదు

దిశ, తెలంగాణ క్రైమ్‌బ్యూరో: మెదక్ జిల్లా పెద్దశంకరంపేట ఎస్ఐ సత్యనారాయణపై చీలపల్లి వాసులు మంగళవారం హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేశారు. గ్రామం మధ్యలో నిర్మిస్తున్న శ్మశాన వాటికను వ్యతిరేకిస్తూ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను వెనక్కి తీసుకోవాలని వేధిస్తున్నారని పేర్కొన్నారు. గ్రామం మధ్యలో శ్మశానవాటిక నిర్మాణంతో ప్రజలు అనారోగ్యం పాలవుతారని తహసీల్దార్, ఆర్డీవోకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, గత్యంతరం లేని పరిస్థితుల్లో హైకోర్టును ఆశ్రయించామన్నారు. అందుకు కోపం పెంచుకున్న సర్పంచ్, ఎంపీటీసీలు ఎస్ఐ ద్వారా వేధిస్తున్నారని అన్నారు. హైకోర్టు […]

Update: 2020-09-22 08:53 GMT

దిశ, తెలంగాణ క్రైమ్‌బ్యూరో: మెదక్ జిల్లా పెద్దశంకరంపేట ఎస్ఐ సత్యనారాయణపై చీలపల్లి వాసులు మంగళవారం హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేశారు. గ్రామం మధ్యలో నిర్మిస్తున్న శ్మశాన వాటికను వ్యతిరేకిస్తూ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను వెనక్కి తీసుకోవాలని వేధిస్తున్నారని పేర్కొన్నారు. గ్రామం మధ్యలో శ్మశానవాటిక నిర్మాణంతో ప్రజలు అనారోగ్యం పాలవుతారని తహసీల్దార్, ఆర్డీవోకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, గత్యంతరం లేని పరిస్థితుల్లో హైకోర్టును ఆశ్రయించామన్నారు. అందుకు కోపం పెంచుకున్న సర్పంచ్, ఎంపీటీసీలు ఎస్ఐ ద్వారా వేధిస్తున్నారని అన్నారు. హైకోర్టు పిటిషన్‌ను వెనక్కి తీసుకోకుంటే అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపుతామని తరచూ హెచ్చరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Tags:    

Similar News