బంగాళాఖాతంలో మరో అల్పపీడనం..
దిశ, వెబ్‌డెస్క్: రెండు తెలుగు రాష్ట్రాలను వర్షాలు ఇప్పట్లో వదిలేలా కనిపించడం లేదు. ఇప్పటికే తెలంగాణ, ఏపీలోని పలుచోట్ల కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అమరావతి వాతావరణ కేంద్రం మరో కీలక విషయం వెల్లడించింది.ఈశాన్య బంగాళాఖాతంలో తాజాగా మరో అల్పపీడనం ఏర్పడిందని.. రాగల 24గంటల్లో అడి మరింత బలపడే ఛాన్స్ ఉందని ప్రకటించింది. దాంతో రానున్న 2-3 రోజుల్లో ఇది వాయవ్యదిశగా ప్రయాణించే అవకాశం ఉండగా.. రాగల 48గంటల్లో ఏపీలోని తీరప్రాంతాలు, యానాంలో భారీ వర్షాలు […]
దిశ, వెబ్‌డెస్క్: రెండు తెలుగు రాష్ట్రాలను వర్షాలు ఇప్పట్లో వదిలేలా కనిపించడం లేదు. ఇప్పటికే తెలంగాణ, ఏపీలోని పలుచోట్ల కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అమరావతి వాతావరణ కేంద్రం మరో కీలక విషయం వెల్లడించింది.ఈశాన్య బంగాళాఖాతంలో తాజాగా మరో అల్పపీడనం ఏర్పడిందని.. రాగల 24గంటల్లో అడి మరింత బలపడే ఛాన్స్ ఉందని ప్రకటించింది.
దాంతో రానున్న 2-3 రోజుల్లో ఇది వాయవ్యదిశగా ప్రయాణించే అవకాశం ఉండగా.. రాగల 48గంటల్లో ఏపీలోని తీరప్రాంతాలు, యానాంలో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. కాగా, జాలర్లు 48 గంటల పాటు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీచేశారు.