కేసీఆర్ ఆయన్ను సొంత తమ్ముడిలా చూసుకున్నారు..

దిశ, హుజురాబాద్ :  మాజీ మంత్రి ఈటలను సీఎం కేసీఆర్ రెండో సీఎంగా, సొంత తమ్ముడిగా చూసుకున్నారని మాజీ మంత్రి బస్వరాజు సారయ్య అన్నారు. ఆదివారం హుజురాబాద్ లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈటల రాజేందర్‌కు అన్ని విధాల గుర్తింపు ఇచ్చారన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. కష్టపడి గెలిపించిన హుజురాబాద్ ప్రజలను కాదని, తండ్రి లాంటి వ్యక్తిని ధిక్కరించి ఈటల వెళ్లిపోయాడని.. టీఆర్ఎస్ పార్టీ ఏమీ బయటకు పంపించ లేదని గుర్తుచేశారు. ఈటల తన బొంద […]

Update: 2021-06-06 04:47 GMT

దిశ, హుజురాబాద్ : మాజీ మంత్రి ఈటలను సీఎం కేసీఆర్ రెండో సీఎంగా, సొంత తమ్ముడిగా చూసుకున్నారని మాజీ మంత్రి బస్వరాజు సారయ్య అన్నారు. ఆదివారం హుజురాబాద్ లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈటల రాజేందర్‌కు అన్ని విధాల గుర్తింపు ఇచ్చారన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. కష్టపడి గెలిపించిన హుజురాబాద్ ప్రజలను కాదని, తండ్రి లాంటి వ్యక్తిని ధిక్కరించి ఈటల వెళ్లిపోయాడని.. టీఆర్ఎస్ పార్టీ ఏమీ బయటకు పంపించ లేదని గుర్తుచేశారు.

ఈటల తన బొంద తానే తవ్వకుంటున్నాడని బస్వరాజు సారయ్య మండిపడ్దారు. ఈటల రాజీనామా అనంతరం వచ్చే ఉపఎన్నికలో టీఆర్ఎస్ పార్టీకే ఓటు వేసేలా రజకులతో ప్రమాణం చేయించారు. కార్యక్రమంలో హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీష్ బాబు, రాష్ట్ర సహయ కార్యదర్శి బండ శ్రీనివాస్, మున్సిపల్ చైర్ పర్సన్ గందె రాధిక, వైస్ చైర్ పర్సన్ కొలిపాక నిర్మల, పట్టణ అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News