విజయశాంతిని మనస్ఫూర్తిగా అలానే పిలుస్తా.. కళ్యాణ్ రామ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

నందమూరి కళ్యాణ్ రామ్(Kalyan Ram) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో దూసుకుపోతున్నారు.

Update: 2025-03-17 03:18 GMT

దిశ, వెబ్‌డెస్క్: నందమూరి కళ్యాణ్ రామ్(Kalyan Ram) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో దూసుకుపోతున్నారు. కేవలం హీరోగానే కాకుండా నిర్మాత(Producer)గా వ్యవహరిస్తూ పలు సినిమాలను ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’(Arjun S/O Vyjayanthi). ప్రదీప్ చిలుకూరి(Pradeep Chilukuri) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని.. అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ బ్యానర్స్ పై నిర్మిస్తున్నారు.

ఇక ఈ సినిమాలో సాయి మంజ్రేకర్(Sai Manjrekar) హీరోయిన్‌గా నటిస్తుండగా.. సీనియర్ హీరోయిన్ విజయశాంతి(Vijayashanthi) కీ రోల్ ప్లే చేస్తున్నారు. అలాగే సోహెల్ ఖాన్(Sohail Khan), శ్రీకాంత్(Srikanth) కూడా నటిస్తున్నారు. ఇక సినిమా ప్రమోషన్లలో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కళ్యాణ్ రామ్ స్టార్ నటి విజయశాంతిపై ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ఆయన మాట్లాడుతూ.. ‘తల్లి కొడుకు చాలా విషయాల్లో గొడవ పడతారు. చివరకు ఒక్కటవుతారు. కానీ ఈ సినిమాలో ప్రేమగా ఉండే తల్లి కొడుకు అనూహ్యంగా దూరం అవుతారు.

మళ్లీ ఎలా కలుసుకున్నారనేది చాలా కీలకం. డైరెక్టర్ ప్రదీప్ ఈ స్టోరీ చెప్పినప్పుడు తల్లి పాత్రలో విజయశాంతినే ఊహించుకున్నా. నేను ఆమెను విజయశాంతి గారు అనను. మనస్ఫూర్తిగా అమ్మ అని పిలుస్తా. ఈ సినిమాకు స్ఫూర్తి కర్తవ్యం. అందులో వైజయంతి పాత్రకు అబ్బాయి ఉంటే ఎలా ఉంటుందనే ఆసక్తికర పాయింట్‌తో ఈ కథను నిర్మించాం’ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

READ MORE ...

అర్జున్ S/O వైజయంతి నుంచి టీజర్ రిలీజ్.. ఎమోషనల్‌గా సాగిన అమ్మ సెంటిమెంట్‌




Tags:    

Similar News