Tuk Tuk: ఆ టైటిల్ పెట్టడానికి కారణం అదే.. ఈ సినిమా సీక్వెల్ కూడా ఉంటోంది
వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో, ఫ్రెష్ కంటెంట్‌తో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘టుక్ టుక్’ (Tuk Tuk).

దిశ, సినిమా: వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో, ఫ్రెష్ కంటెంట్‌తో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘టుక్ టుక్’ (Tuk Tuk). సి.సుప్రీత్ కృష్ణ (C. Supreet Krishna) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో హర్ష రోషన్ (Harsh Roshan), కార్తికేయ దేవ్, స్టీవెన్ మధు, సాన్వీ మేఘన, నిహాల్ కోధాటి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. చిత్రవాహిని అండ్ ఆర్ వై జి సినిమాస్ పతాకంపై రాహుల్ రెడ్డి, లోక్కు శ్రీ వరుణ్, శ్రీరాముల రెడ్డిలు నిర్మిస్తున్న ఈ మూవీ ఈనెల 21 న రిలీజ్ కానుంది. ఈ క్రమంలో తాజాగా మీడియాలో ముచ్చటించిన డైరెక్టర్ సుప్రీత్ కృష్ణ.. సినిమా విశేషాలు పంచుకున్నారు.
‘ఓ క్రికెట్ యాడ్(Cricket ad)లో ఓ వెహికల్ చూసినప్పుడు కలిగిన ఆలోచన ఇది. వెహికల్(Vehicle)కు లైఫ్ ఉంటే ఎలా ఉంటుంది? అనే ఆలోచన నుంచి వచ్చిన కథ ఇది. ఈ అంశానికి కమర్షియల్ ప్యాకేజీని కలిపి చేసిన చిత్రం టుక్ టుక్. పిల్లల దగ్గరికి టుక్‌టుక్ ఎలా వచ్చింది? ఈ వెహికల్ వెనుక కథ ఏమిటి అనేది ఆసక్తి కరంగా చెప్పాం. ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు ఎమోషన్ కూడా ఉంటుంది. ఈ సినిమాకు ‘టుక్ టుక్’ అనే టైటిల్ ఎందుకు పెట్టాము అనేది తెలియాలంటే ఖచ్చితంగా సినిమా చూడాలి’ అని తెలిపారు. ఇక ఈ సినిమా సీక్వెల్‌పై మాట్లాడుతూ.. ‘టుక్ టుక్ ఫ్రాంచైజీని డిజైన్ చేసే ఆలోచన ఉంది. డిఫరెంట్ వెహికల్స్(Different vehicles)తో, డిఫరెంట్ బ్యాక్‌స్టోరీతో ఆ ఫ్రాంఛైజీని కొనసాగించాలనుకుంటున్నాను’ అని తెలిపారు.