Chiyaan Vikram: దయచేసి ఫైవ్ మినిట్స్ ముందే థియేటర్‌కి వెళ్లండి.. నెటిజనులకు స్టార్ హీరో రిక్వెస్ట్
చియాన్ విక్రమ్ (Chiyaan Vikram) మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్-ప్యాక్డ్ మూవీ ‘వీర ధీర సూరన్’ (Veera Dheera Sooran)

దిశ, సినిమా: చియాన్ విక్రమ్ (Chiyaan Vikram) మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్-ప్యాక్డ్ మూవీ ‘వీర ధీర సూరన్’ (Veera Dheera Sooran). సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ఎస్.యు. అరుణ్ కుమార్(S.U. Arun Kumar) దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఎస్.జె. సూర్య, సూరజ్ వెంజరాముడు, దుషార విజయన్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. H.R. పిక్చర్స్ రియా శిబు నిర్మించిన ఈ చిత్రం ఒక యాక్షన్ థ్రిల్లర్, ఇప్పటికే రీలీజైన ప్రమోషనల్ కంటెంట్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో భారీ అంచనాల మధ్య ఈ మూవీ మార్చి 27న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. అయితే.. ఈ సినిమా తెలుగు రైట్స్‌ను ఎన్.వి.ఆర్ సినిమా సొంతం చేసుకోగా, నైజాం రిలీజ్ మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ (Mythri Movie Distributors) ద్వారా జరుగుతుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ప్రెస్ మీట్ (Prerelease press meet) నిర్వహించారు.
ప్రీరిలీజ్ ప్రెస్ మీట్‌లో హీరో విక్రమ్ మాట్లాడుతూ.. ‘అందరికీ నమస్కారం. మాస్ సినిమాలు చేస్తున్నాను కానీ రస్టిక్‌గా ఉండే సినిమా చేసి చాలా రోజులైంది. ఫ్యాన్స్ కోసం మంచి రస్టిక్ యాక్షన్ (Rustic action) ఉన్న ఒక సినిమా చేయాలని నేను డైరెక్టర్ అరుణ్ అనుకున్నాం. యాక్షన్‌తో పాటు మంచి ఎమోషన్ ఉన్న సినిమా ఇది. ఇలాంటి సినిమాలు చేయడానికి మంచి పెర్ఫార్మర్స్ కావాలి. ఈ సినిమా కోసం మేము ఫస్ట్ అప్రోచ్ అయిన యాక్టర్ సూర్య (Surya). ఆయన ఇందులో క్యారెక్టర్ చేయడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఈ క్యారెక్టర్‌కి సూర్య గారు అయితేనే పర్ఫెక్ట్. ఇందులో తుషార (Thuzhara) డిఫరెంట్ క్యారెక్టర్స్ (Different characters) చేస్తున్నారు. ఆమె పెర్ఫార్మెన్స్ క్యారెక్టర్ మెమొరబుల్‌గా ఉంటాయి. పృద్వికి ఈ సినిమా ఒక టర్నింగ్ పాయింట్ అవుతుంది. తెలుగులో అన్ని రకాల సినిమాలు అద్భుతమైనటువంటి విజయాన్ని సాధిస్తున్నాయి. యాక్టర్స్‌కి ఇది చాలా గొప్ప అవకాశం. అన్ని రకాల పాత్రలు చేసే ఛాన్స్ ఉంటుంది . తెలుగు ఆడియన్స్ చూపిస్తున్న ప్రేమ అద్భుతం. వారి ప్రేమకి నా కృతజ్ఞతలు. మార్చి 27న ఈ సినిమా వస్తోంది. ఇది అందరూ ఎంజాయ్ చేసే సినిమా. కచ్చితంగా మీరంతా ఎంజాయ్ చేస్తారని నమ్ముతున్నాను. ఈ సినిమా ఫస్ట్ షాట్ నుంచే కథ మొదలైపోతుంది. అందుచేత ఒక ఫైవ్ మినిట్స్ ముందే థియేటర్‌లో ఉండేలా చూసుకోవాలని ప్రేక్షకులుని కోరుతున్నాను’ అని చెప్పుకొచ్చాడు.