Kalyan Ram: ‘అర్జున్ S/O వైజయంతి’ స్టోరీ లీక్ చేసిన కళ్యాణ్ రామ్.. బ్లాక్ బస్టర్ కన్ఫార్మ్ అంటున్న నెటిజన్లు
నందమూరి కళ్యాణ్ రామ్ Kalyan Ram() మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ ఫ్యామిలీ డ్రామా ‘అర్జున్ S/O వైజయంతి’ (Arjun S/O Vyjayanthi).

దిశ, సినిమా: నందమూరి కళ్యాణ్ రామ్ Kalyan Ram() మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ ఫ్యామిలీ డ్రామా ‘అర్జున్ S/O వైజయంతి’ (Arjun S/O Vyjayanthi). సీనియర్ నటి విజయశాంతి (Vijayashanti) ఈ చిత్రంలో పవర్ ఫుల్ పాత్రని పోషిస్తున్నారు. ప్రదీప్ చిలుకూరి (Pradeep Chilukuri) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీని అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై అశోక్ వర్ధన్ ముప్పా సునీల్ బలుసు నిర్మించారు. తాజాగా ఈ సినిమా టీజర్(Teaser)ని మేకర్స్ లాంచ్ చేశారు. ఐపీఎస్ ఆఫీసర్ విజయశాంతి విధి నిర్వహణలో నేరస్థులపై కాల్పులు జరపడంతో టీజర్ ప్రారంభమవుతుంది. చావుకి ఎదురెళ్ళిన ప్రతిసారి ఆమెకు కొడుకు అర్జున్ ముఖం గుర్తుకు వస్తుంది. వైజాగ్‌లో నేరస్థులని నియంత్రించడంలో పోలీసులు, కోర్టులు రెండూ విఫలమైనప్పుడు, అర్జున్ పరిస్థితిని తన చేతుల్లోకి తీసుకుంటాడు. చట్టాన్ని ధిక్కరించే ఎవరినీ శిక్షించకుండా ఉండనివ్వనని విజయశాంతి చెప్పడం, అర్జున్ అమ్మకు బర్త్ డే విషెష్ చెప్పడంతో టీజర్ ఎంట్ అవుతోంది.
ఈ టీజర్ ఈవెంట్‌లో కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ.. ‘తెలుగు ప్రేక్షకులకు, నందమూరి అభిమానులకు నా హృదయపూర్వక నమస్కారాలు. అమ్మ (విజయశాంతి) చేసిన కర్తవ్యం (Kartavyam) సినిమాని ఎవరు మర్చిపోలేం. ఈ సినిమా కథని డైరెక్టర్ ప్రదీప్ చెప్తుంటే కర్తవ్యం సినిమాలో వైజయంతి క్యారెక్టర్‌కి కొడుకు పుడితే ఎలాంటి ఇన్సిడెంట్స్ (incidents) జరుగుతాయి అనేది ఈ కథ అన్నారు. అయితే అమ్మ ఒప్పుకుంటేనా ఈ సినిమా చేద్దామని అన్నాను. ఈ సినిమా మెయిన్ పిల్లర్ (Main pillar) అమ్మ. ఈ వయసులో కూడా అమ్మ ఎలాంటి డూప్ లేకుండా అద్భుతమైనటువంటి స్టంట్స్ చేశారు. పృథ్వి చాలా అద్భుతమైనటువంటి క్యారెక్టర్ చేశారు. యానిమల్ సినిమా ఎంత పేరు తీసుకొచ్చిందో, తెలుగులో ఈ సినిమా అంతా గుర్తింపు తెస్తుందని ఆయన మొదటి రోజు నుంచి చెప్పారు.
ఈ సినిమాకి ఆయనే డబ్బింగ్ చెప్పారు. అతడు ఒక్కడే సినిమా వచ్చి 20 ఏళ్లు అవుతోంది. కానీ ఇప్పటికీ అందరూ దాని గురించి మాట్లాడుకుంటూరు. అలాగే ఈ సినిమాను కూడా మరో 20 ఏళ్ల పాటు గుర్తుండిపోతుంది. ఒక అమ్మ ప్రాణాన్ని పణంగా పెట్టి ఒక బిడ్డకి జన్మనిస్తుంది. అలాంటి స్త్రీమూర్తులని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఆ బాధ్యత కోసం మనం ఎంత త్యాగం చేసిన సరిపోదు. అదే అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ అంటూ చెప్పుకొచ్చారు. మొత్తానికి విజయశాంతి ‘కర్తవ్యం’ సినిమాలాగే ఉంటుంది అనే కళ్యాణ్ మాటలు ‘అర్జున్ S/O వైజయంతి’ మూవీపై మరింత ఇంపాక్ట్‌ను క్రియేట్ చేస్తున్నాయి. దీంతో ఈ సినిమా బ్లాక్ బస్టర్ కన్ఫార్మ్ అంటున్నారు నెటిజన్లు