హీరో ధనుష్‌తో రొమాన్స్ చేయబోతున్న యంగ్ బ్యూటీ.. డైరెక్టర్ ఎవరంటే..?

మలయాళ బ్యూటీ మమిత బైజు(Mamitha Baiju) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె మలయాళంలో ఎన్నో సినిమాలు చేసిన రాని గుర్తింపు తెలుగులో వచ్చిన ‘ప్రేమలు’(Premalu) మూవీతో ఓవర్ నైట్ స్టార్‌డమ్ అందుకుంది.

Update: 2025-03-19 05:45 GMT
హీరో ధనుష్‌తో రొమాన్స్ చేయబోతున్న యంగ్ బ్యూటీ.. డైరెక్టర్ ఎవరంటే..?
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: మలయాళ బ్యూటీ మమిత బైజు(Mamitha Baiju) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె మలయాళంలో ఎన్నో సినిమాలు చేసిన రాని గుర్తింపు తెలుగులో వచ్చిన ‘ప్రేమలు’(Premalu) మూవీతో ఓవర్ నైట్ స్టార్‌డమ్ అందుకుంది. ఆమె నటనకు దర్శకధీరుడు రాజమౌళి(Rajamouli) సైతం ఫిదా అయ్యారు. అలాగే తన అందం, అభినయంతో తెలుగు కుర్రాళ్ల మనసు గెలుచుకుంది. చేసింది ఒక్క సినిమానే అయినా ఈ బ్యూటీ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.

దీంతో వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. అలా విష్ణు విశాల్(Vishnu Vishal), మాస్ మహారాజ్ రవితేజ(Raviteja), ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan) వంటి హీరోల సరసన నటించే చాన్స్ కొట్టేసింది. ఈ నేపథ్యంలో మరో సినిమాకు ఓకే చేసినట్లు ఓ న్యూస్ నెట్టింట వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ హీరో మరెవరో కాదండోయ్ ఓ పక్కా హీరోగా మరొపక్క డైరెక్టర్‌గా మంచి మంచి సినిమాలు చేస్తూ స్టార్‌గా రాణిస్తున్న కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్(Dhanush).

అయితే వీరిద్దరు జంటగా నటిస్తున్న చిత్రానికి ‘పోర్ థోజిల్’ ఫేమ్ డైరెక్టర్ విఘ్నేష్ రాజా(Vignesh Raja) దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే భారీ యాక్షన్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వేల్స్(Vels) నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మరి ఇందులో నిజమెంతుందో తెలియనప్పటికీ ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Tags:    

Similar News