పవన్ కల్యాణ్ - విరాట్ కోహ్లీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. పోస్టర్ రిలీజ్ చేసిన టాలీవుడ్ HERO
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan), టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli)ల ఫాలోయింగ్ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే.

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan), టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli)ల ఫాలోయింగ్ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. సినిమాల్లో పవన్ కల్యాణ్‌కు ఉన్న క్రేజ్ మరే హీరోకు ఉండదు అనే విషయాన్ని పలుమార్లు ఇతర హీరోలే మాట్లాడుకోవడం చూశాం.. క్రికెట్‌లోనూ విరాట్ కోహ్లీకి ఉన్న ఫాలోయింగ్ మరే క్రికెటర్‌కు ఉండదు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోల్లో చాలా మంది పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఉన్నట్లుగానే.. జట్టులో స్థానం సంపాదించుకుంటున్న అనేకమంది విరాట్ కోహ్లీని ఆదర్శంగా తీసుకొని వస్తున్నారు.
తాజాగా వీరిద్దరి ఫ్యాన్స్‌కు టాలీవుడ్ హీరో సాయిదుర్గతేజ్(Sai Dharam Tej), ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ(Suryadevara Naga Vamsi) శుభవార్త చెప్పారు. ఐపీఎల్(IPL 2025) ప్రారంభం కాబోతున్న వేళ విరాట్ కోహ్లీ కీలకంగా ఉన్న ఆర్సీబీకి విష్ చేస్తూ కొత్త పోస్టర్ విడుదల చేశారు. ‘FIRESTORM IS COMING’ అనే క్యాప్షన్ జత చేసి పోస్టర్ వదిలారు. కాగా, ఆర్సీబీ తొలి మ్యాచ్ కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరుగబోతోంది. మార్చి 22వ తేదీన ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ సీజన్ ఐపీఎల్‌లో ఇదే తొలి మ్యాచ్ కావడం గమనార్హం.