ఇట్స్ అఫీషియల్.. రాకింగ్ స్టార్ ‘టాక్సిక్’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్.. యష్ పోస్టర్ అదిరిపోయిందంతే..
కెరీర్ స్టార్టింగ్‌లో బుల్లి తెర హీరోగా ఎంట్రీ ఇచ్చి.. తర్వాత కాలంలో పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిన రాకింగ్ స్టార్ యష్(Rocking Star Yash) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: కెరీర్ స్టార్టింగ్‌లో బుల్లి తెర హీరోగా ఎంట్రీ ఇచ్చి.. తర్వాత కాలంలో పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిన రాకింగ్ స్టార్ యష్(Rocking Star Yash) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మాస్ యాక్షన్ సినిమాలతో సౌత్ ఆడియన్స్ హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్నాడు. ఎటువంటి ఫిల్మ్ బ్యాక్ గ్రౌండ్ లేని ఫ్యామిలీ నుంచి వచ్చి నేడు టాప్ హీరోగా రాణించడం అంటే మామూలు విషయం కాదనే చెప్పాలి. ‘కేజీఎఫ్ 1,2’(KGF) సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఆయన ప్రస్తుతం వరుస సినిమాల్లో ఆఫర్లు అందుకుంటూ స్టార్ హీరోగా రాణిస్తున్నాడు.
ఇక అతని వ్యక్తిగత విషయానికి వస్తే.. కన్నడ ఇండస్ట్రీలో హీరోయిన్‌గా రాణిస్తున్న రాధిక పండిట్(Radhika Pandit)ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కాగా వీరికి ఇద్దరు పిల్లలు కూడా. ప్రస్తుతం యష్ ‘రామాయణం’ (Ramayanam) అనే సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమా కాకుండా యష్ నటిస్తున్న అతి పెద్ద ప్రాజెక్ట్ ‘టాక్సిక్’(Toxic). గీతు మోహన్‌దాస్(Geethu Mohandas) ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ‘కేవీఎన్ ప్రొడక్షన్స్’(KVN Productions) ఈ మూవీని భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది.
ఇక ఇందులో లేడీ సూపర్ స్టార్ నయనతార(Nayanthara), బాలీవుడ్ అందాల తార కియారా అద్వానీ(Kiara Advani)లు కథానాయికలుగా నటిస్తున్నారు.ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ ఆకట్టుకుని సినిమాపై భారీ అంచనాలను పెంచేశాయి. దీంతో ఈ మూవీ థియేటర్లలో ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియులు ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు మేకర్స్.
ఈ మేరకు ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ.. ‘పెద్దల కోసం ఒక అద్భుత కథ… టాక్సిక్ 19-03-2026న బాధ్యతలు స్వీకరించింది’ అంటూ విడుదల తేదీని ప్రకటించారు. ఇక కొత్తగా రిలీజ్ చేసిన పోస్టర్‌లో.. యశ్ ఒక కరుడు గట్టిన గ్యాంగ్ స్టర్‌లా మెషిన్ గన్‌తో నడుస్తూ కనిపించాడు. ఇక రాఖీ భాయ్ ధరించిన చెవిపోగులు, హెయిర్ స్టైల్, కౌబాయ్ టోపీ అభిమానులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ‘టాక్సిక్’ సినిమా పోస్టర్ విడుదలైన నిమిషాల్లోనే వైరల్ అయింది. అభిమానులు, నెటిజన్లు ఈ పోస్టర్ పై క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.