Kiara Advani : రెమ్యునరేషన్ పెంచేసిన కియారా అద్వానీ.. బాలీవుడ్‌లో ఆ లిస్ట్‌లో చేరిపోయిన్ బ్యూటీ
బాలీవుడ్ (Bollywood) బ్యూటీ కియారా అద్వానీ (Kiara Advani) ప్రజెంట్ భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంటుంది.

దిశ, సినిమా: బాలీవుడ్ (Bollywood) బ్యూటీ కియారా అద్వానీ (Kiara Advani) ప్రజెంట్ భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంటుంది. గతేడాది ‘గేమ్ చేంజర్’ (Game changer) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ బ్యూటీ.. ఇప్పుడు రాకింగ్ స్టార్ యశ్ (Rocking Star Yash) మూవీలో చాన్స్ అందుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా కియారా రెమ్యునరేషన్(Remuneration)కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ బజ్ నెట్టింట వైరల్ అవుతోంది.
యశ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘టాక్సిక్’ (Toxic). మలయాళ దర్శకురాలు గీతు మోహన్‌దాస్ (Geetu Mohandas) దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో రూపొందుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. 2026 మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ సినిమా కోసం ఈ అమ్మడు గట్టిగానే చార్జ్ చేసిందట. గేమ్ చేంజర్ సినిమా కోసం రూ. 7 కోట్ల నుంచి రూ. 8 కోట్ల వరకు తీసుకున్న కియారా.. ‘టాక్సిక్’ కోసం ఏకంగా రూ. 10 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే.. వైరల్ అవుతున్న ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ, దీంతో.. బాలీవుడ్‌లో భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్న బ్యూటీస్ లిస్ట్‌లో ఇప్పుడు ఈ భామ కూడా చేరిపోయింది అంటూ బాలీవుడ్ వర్గాలు డిస్కస్ చేసుకుంటున్నాయి.