ఓవర్సీస్‌లోనూ అదిరిపోయే కలెక్షన్లు రాబడుతున్న తెలుగు సినిమా.. ఇది కదా తెలుగోడి పవర్ అంటున్న నెటిజన్లు..

నేచురల్ స్టార్‌ హీరో నాని(Nani) నిర్మాణంలో.. రామ్‌ జగదీష్(Ram Jagadeesh) దర్శకత్వంలో ప్రియదర్శి(Priyadarshi) ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ‘కోర్టు’(Court).

Update: 2025-03-27 02:19 GMT
ఓవర్సీస్‌లోనూ అదిరిపోయే కలెక్షన్లు రాబడుతున్న తెలుగు సినిమా.. ఇది కదా తెలుగోడి పవర్ అంటున్న నెటిజన్లు..
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: నేచురల్ స్టార్‌ హీరో నాని(Nani) నిర్మాణంలో.. రామ్‌ జగదీష్(Ram Jagadeesh) దర్శకత్వంలో ప్రియదర్శి(Priyadarshi) ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ‘కోర్టు’(Court). ఈ మూవీ మార్చి 14న థియేటర్లలో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. చిన్న చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వ‌చ్చిన కోర్టు మువీ ఊహించని విధంగా పెద్ద హిట్ కొట్టింది. విడుదలైన ఫస్ట్ రోజే రూ.8 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ సినిమా కేవలం పది రోజుల్లోనే రికార్డు వసూళ్లు రాబట్టింది.

ఏకంగా రూ.50 కోట్ల క్లబ్‌లో చేరి అందరినీ ఆశ్చర్యపరిచింది. కోర్ట్ బ్యాక్ డ్రాప్ డ్రామాగా పోక్సో యాక్ట్ నేపథ్యంలో రూపొందించిన ఈ చిత్రంలో శ్రీదేవి(Sridevi), రోషన్(Roshan) జంటగా నటించి తమ అద్భుత నటనతో ప్రేక్షకులను కట్టిపడేశారు. ఇక శివాజీ(Shivaji), సాయి కుమార్(Sai Kumar), రోహిణి(Rohini), హర్షవర్ధన్(Harsha Vardhan), శుభలేఖ సుధాకర్ వంటి సీనియర్‌ నటులు తమ ఫర్మామెన్స్‌తో తమ పాత్రలకు జీవం పోశారు. ఇదిలా ఉంటే.. ఇప్పటికే రూ.50కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం ఓవర్సీస్‌లోనూ దూసుకెళ్తుంది.

అమెరికా గడ్డపై $1 మిలియన్ మార్క్‌ను క్రాస్ చేసినట్లు మేకర్స్ ట్వీట్ చేశారు. కంటెంట్ ఉన్న సినిమాలను ప్రజలు ఆదరిస్తారని మరోసారి నిరూపితమైందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. నెటిజన్లు ఇది కదా తెలుగోడి పవర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఓటీటీ(OTT) రిలీజ్‌కు కాస్తా టైమ్ పట్టవచ్చని సినీ వర్గాలు తెలిపాయి.


Tags:    

Similar News