చాలా గ్యాప్ తర్వాత వచ్చేస్తున్న సంపూర్ణేష్ బాబు.. ఈసారి కూడా ఎంటర్‌టైన్మెంట్ ఫుల్ అంటున్న డైరెక్టర్

Update: 2025-03-26 14:39 GMT
చాలా గ్యాప్ తర్వాత వచ్చేస్తున్న సంపూర్ణేష్ బాబు.. ఈసారి కూడా ఎంటర్‌టైన్మెంట్ ఫుల్ అంటున్న డైరెక్టర్
  • whatsapp icon

దిశ, సినిమా: వైవిధ్యమైన సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చెయ్యడంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాందించుకున్నాడు హీరో సంపూర్ణేష్‌ బాబు(Sampoornesh Babu). ఇప్పుడు చాలా గ్యాప్ తర్వాత ఈ సారి అన్నదమ్ముల అనుబంధాన్ని ఆవిష్కరిస్తున్న ‘సోదరా’ (Sodara) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రంలో సంపూర్ణేష్ బాబుతో పాటు సంజోష్‌,(Sanjosh) ప్రాచీబంసాల్ ( Prachi Bansal), ఆరతి గుప్తా(Aarti Gupta) ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మన్మోహన్‌ మేనంపల్లి(Manmohan Menampally) దర్శకత్వంలో క్యాన్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై చంద్ర చగంలా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తిచేసుకుని, నిర్మాణానంతర పనులను శరవేగంగా జరుపుకుంటోన్న ఈ మూవీ ఏప్రిల్‌ 11న రిలీజ్ కాబోతుంది.

ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. ‘అన్నదమ్ముల బంధం ఎంత గొప్పదో మనందరికీ తెలుసు అలాంటి అన్నదమ్ముల బంధాన్ని వెండితెరపై మనకు ఆవిష్కరించబోతున్న చిత్రమే సోదరా. ఇంతకు ముందు ఈ చిత్రం నుండి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ అలాగే నాలుగు పాటలకు మంచి స్పందన లభించాయి. తెలుగు చిత్రసీమలో ఎందరో సోదరులు ఉన్నారు. అలాంటి సోదరులందరినీ బంధాన్ని అద్దం పట్టేలా చూపించడానికి ఈ సోదరా వస్తోంది. తప్పకుండా మా సోదరా చిత్రం ఈ వేసవికి ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేస్తుందనే నమ్మకం ఉంది. సంపూర్ణేష్‌ బాబు నుంచి ప్రేక్షకులు ఆశిస్తున్న ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు ఆయనలోని మరో కోణాన్ని ఈ చిత్రంలో చూడబోతున్నారు. తప్పకుండా ఈ చిత్రం విజయం సాధిస్తుంది’ అన్నారు.

Tags:    

Similar News

Rashi Singh

Rashi Singh