Single: ‘సింగిల్’ నుంచి ఫస్ట్ సింగిల్ అప్‌డేట్.. ఎన్నాళ్లు ఇలా ఉంటారు అంటూ హీరో పోస్ట్
హీరో శ్రీవిష్ణు (Sri Vishnu) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సింగిల్’ (Single).

దిశ, సినిమా: హీరో శ్రీవిష్ణు (Sri Vishnu) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సింగిల్’ (Single). నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind) సమర్పణలో కళ్యా ఫిల్మ్స్‌తో కలిసి విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘నిను వీడని నీడను నేనే’ ఫేం కార్తీక్ రాజు (Karthik Raju) దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో నుంచి ఇప్పటికే వచ్చిన గ్లింప్స్‌కు సోషల్ మీడియాలో విశేష స్పందన లభించింది. ఈ సినిమాలో హీరో ప్రేమ, రిలేషన్ లాంటి పదాలకు దూరంగా ‘సింగిల్’గా ఉండేందుకు ఇష్టపడతాను.. కానీ తనను ఇద్దరు అమ్మాయిలు లవ్ చేస్తారు. ఇక ఇద్దరు అమ్మాయిల్లో ఏ అమ్మాయితో మన హీరో మింగిల్ అవుతాడా అనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో పెరిగింది. దీంతో సినిమా నుంచి వచ్చే అప్‌డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఈ క్రమంలోనే తాజాగా ఫస్ట్ సింగిల్ (First single) అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ‘అబ్బాయిలు.. ఎన్నాలు ‘సింగిల్’గా ఉంటారు.. మింగిల్ అవ్వడానికి సిద్ధం అవ్వండి.. మా సింగిల్ నుంచి మొదటి సింగిల్ ‘శిల్పీ ఎవరో’ రేపు ఉదయం 11 గంటలకు రాబోతుంది’ అంటూ చెప్పుకొచ్చారు. ఇక ఈ మూవీ సమ్మర్ స్పెషల్‌గా మే నెలలో రిలీజ్ కాబోతున్నట్లు తెలిపారు కానీ విడుదుల తేదీ మాత్రం అనౌన్స్ చెయ్యలేదు.