Sreeleela : నా కెరీర్‌లో ఇదే బెస్ట్ సినిమా.. చాలా సంతోషంగా గడిపా.. స్టార్ హీరోయిన్ కామెంట్స్
నితిన్ (NIthin), శ్రీలీల (Sree leela) జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రాబిన్‌హుడ్’ (Robin Hood)

దిశ, సినిమా: నితిన్ (NIthin), శ్రీలీల (Sree leela) జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రాబిన్‌హుడ్’ (Robin Hood). వెంకీ కుడుముల (Venky Kudumula) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ (David Warner), వెన్నెల కిషోర్ (Vennela Kishore), రాజేంద్ర ప్రసాద్ (Rajendra Prasad) తదితరులు కీలక పాత్రలో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్స్‌పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన ప్రతి అప్‌డేట్ ప్రేక్షకులను ఆకట్టుకోగా.. భారీ అంచనాల మధ్య ఈ మూవీ ఈ నెల 28న థియేటర్స్‌లో విడుదల కాబోతుంది. దీంతో ప్రమోషన్స్‌లో జోరు పెంచిన మేకర్స్ డిఫరెంట్ కంటెంట్‌తో ఆడియన్స్ దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఈ క్రమంలోనే వరుస ఇంటర్వ్యూలో పాల్గొంటూ ప్రేక్షకుల్లోకి సినిమాను మరింతగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీలీల ‘రాబిన్‌హుడ్’ సినిమాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ‘నా కెరీర్‌లో ఇంత సరదాగా గడిపిన సినిమా నేను ఎప్పుడూ చేయలేదు. రాబిన్‌హుడ్ నా ఫిల్మోగ్రఫీ(Filmography)లో పూర్తి ఎంటర్‌టైనర్(Entertainer)గా నిలుస్తుంది. వెన్నెల కిషోర్ అండ్ రాజేంద్రప్రసాద్‌తో షూటింగ్ చేస్తున్నప్పుడు నేను చాలా పెద్దగా నవ్వేదాన్ని’ అంటూ చెప్పుకొచ్చింది.