Mohanlal: ‘గాడ్ ఫాదర్’ పార్ట్ 2 తీసే చాన్స్ లేదు.. చిరంజీవి సినిమాపై మోహన్ లాల్ షాకింగ్ కామెంట్స్
మలయాళ (Malayalam) సూపర్‌స్టార్ మోహన్‌లాల్ (Mohanlal), పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) కాంబోలో తెరకెక్కిన మోస్ట్ వెయిటెడ్ చిత్రం ‘L2: ఎంపురాన్’

దిశ, సినిమా: మలయాళ (Malayalam) సూపర్‌స్టార్ మోహన్‌లాల్ (Mohanlal), పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) కాంబోలో తెరకెక్కిన మోస్ట్ వెయిటెడ్ చిత్రం ‘L2: ఎంపురాన్’ (L2: Empuran). బ్లాక్ బస్టర్ చిత్రం లూసిఫర్(Lucifer)కి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీని ఆశీర్వాద్ సినిమాస్, శ్రీ గోకులం మూవీస్ అండ్ లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీలో మోహన్ లాల్‌తో పాటు పృథ్వీరాజ్ సుకుమారన్, టోవినో థామస్, ఇంద్రజిత్ సుకుమారన్, మంజు వారియర్, అభిమన్యు సింగ్, జెరోమ్ ఫ్లిన్, ఎరిన్ ఎబౌనీ అండ్ సూరజ్ వెంజరమూడు తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇందులో నుంచి ఇప్పటికే వచ్చిన ప్రతి అప్‌డేట్ ప్రేక్షకుల్లో భారీ హైప్‌ను క్రియేట్ చెయ్యగా.. ప్రపంచ వ్యాప్తంగా ఈనెల 27న మలయాళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది.
ఇక మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మోహన్ లాల్.. మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) నటించిన ‘గాడ్ ఫాదర్’ (godfather) సినిమాపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. ‘మాలయాళంలో నేను నటించిన ఎన్నో సినిమాలు ఇతర భాషల్లో డబ్ చేయబడ్డాయి. అలాగే ‘లూసిఫర్’కి డబ్ మూవీగా తెలుగులో ‘గాడ్ ఫాదర్’ తెరకెక్కించారు. అయితే.. ఒరిజినల్ సినిమాల స్టోరీలో కొన్ని మార్పులు చేసి ఆ మూవీని రూపొందించారు. అలాగే.. మొదటి భాగంలో ఉన్న కొన్ని పాత్రలను కూడా తెలుగు రీమేక్‌లో లేవు. అందుకే ఇప్పుడు వస్తున్న ‘L2: ఎంపురాన్’ ఆధారంగా ‘గాడ్ ఫాదర్ 2’ వాళ్లు తెరకెక్కించలేరు’ అంటూ చెప్పుకొచ్చాడు.