Seethannapeta Gate : ‘సీతన్నపేట గేట్’ సినిమా విడుదల తేదీ ప్రకటించిన మూవీ టీమ్..?
వైఎంఆర్ క్రియేషన్స్.. ఆర్ ఎస్ ప్రొడక్షన్స్ సంయుక్త నిర్మాణంలో వై రాజ్ కుమార్ (Y Raj Kumar)డైరెక్షన్‌లో వస్తోన్న తాజా చిత్రం సీతన్నపేట గేట్ (Sithannapeta Gate).

దిశ, వెబ్‌డెస్క్: వైఎంఆర్ క్రియేషన్స్.. ఆర్ ఎస్ ప్రొడక్షన్స్ సంయుక్త నిర్మాణంలో వై రాజ్ కుమార్ (Y Raj Kumar)డైరెక్షన్‌లో వస్తోన్న తాజా చిత్రం సీతన్నపేట గేట్ (Sithannapeta Gate). ఈ మూవీలో పార్థు, వేణు గోపాల్(Venu Gopal), 8 పీఎం సాయి కుమార్, రఘుమారెడ్డి (Raghumareddy) తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అయితే తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించిన టీమ్ గుడ్ న్యూస్ ప్రకటించింది.
ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడారు. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలేనని అన్నారు. కార్ల్ మార్క్స్ (Karl Marx) చెప్పినట్లుగా మన సొసైటిలో చాలా మంది ఆర్థిక సంబంధాలే పెట్టుకుంటున్నారని తెలిపారు. అంతేకాకుండా సమ్ టైమ్స్ ఇవ్వి అక్రమ సంబంధాలుగా కూడా మారుతున్నాయని చెప్పుకొచ్చారు. కాగా ఇలాంటి వాస్తవ సంఘటనల ఆధారంగా వస్తోన్న సినిమానే సీతన్న పేట గేట్ అని దర్శకుడు చెప్పుకొచ్చారు.
ఈ క్రమంలోనే ఏప్రిల్ 4 వ తేదీన మూవీ విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే గెస్ట్ గా విచ్చేసిన దర్శకుడు వి సముద్ర (Director V Samudra) .. సినిమాను అందరూ ఆదరించాలని, నిర్మాత ఆర్ శ్రీనివాస్ (Producer R Srinivas) కథ బాగుంటే ఎంత చిన్న మూవీ అయినా ప్రేక్షకులు ఆదరిస్తారని అన్నారు. ఇక హీరో వేణు గోపాల్ మాట్లాడుతూ..తన క్యారెక్టర్ ఎలా ఉందో చెప్పుకొచ్చారు. చాలా మాస్‌గా కనిపిస్తానని వెల్లడించారు.