PREMALO VIDEO SONG: కోర్టు మూవీ నుంచి బ్లాక్ బస్టర్ సాంగ్ ఫుల్ వీడియో రిలీజ్
కోర్జు మూవీ ఎంతగా హిట్ కొట్టిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

దిశ, వెబ్‌డెస్క్: కోర్జు (Court) మూవీ ఎంతగా హిట్ కొట్టిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ బ్లాక్ బస్టర్ చిత్రానికి జగదీష్ (Jagadish) దర్వకత్వం వహించారు. ప్రస్తుతం ఈ మూవీ బాక్సాఫీసు వద్ద మంచి టాక్ సొంతం చేసుకుంటుంది. వసూళ్ల పరంగా కూడా దూసుకుపోతుందని చెప్పుకోవచ్చు. టాలీవుడ్ హీరో నేచురల్ స్టార్ నాని (Natural Star Nani) నిర్మించిన ఈ మూవీ ఈ నెల (మార్చి) 14 వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి విపరీతంగా ఆకట్టుకుంటుంది.
ఈ బ్లాక్ బస్టర్ హిట్ మూవీలో కుర్ర జంట అయిన రోషన్ (Roshan) అండ్ శ్రీదేవి (Sridevi) నటించారు. జాబిలి, చందు అనే పాత్రల్లో కనిపించి.. అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకుల్ని మంత్రముగ్దుల్ని చేశారు. ఇందులో ప్రియదర్శి లాయర్‌గా కనిపించి మరింత క్రేజ్ సొంతం చేసుకున్నాడు.
ఇకపోతే ఈ మూవీలోని సాంగ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ముఖ్యంగా ‘కథలెన్నో చెప్పారు కవితల్ని రాశారు’ అనే సాంగ్ అయితే జనాల్ని బాగా ఆకట్టుకుంది. యూట్యూబ్ షాట్స్‌లో, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో బాగా ట్రెండ్ అవుతోంది కూడా. అయితే ఈ సాంగ్ నుంచి ఫుల్ వీడియో విడుదల అయ్యింది. దీంతో యువత ఫుల్ ఖుషీ అవుతున్నారు.