‘బట్టలు మార్చుకుంటున్నప్పుడు పర్మిషన్ లేకుండా కారవాన్ డోర్ తీశాడు’.. హీరోయిన్ సెన్సేషనల్ కామెంట్స్
అర్జున్ రెడ్డి (Arjun Reddy)సినిమాతో యువతలో ఫుల్ క్రేజ్ దక్కించుకుంది హీరోయిన్ షాలిని పాండే (Shalini Pandey).

దిశ, వెబ్‌డెస్క్: అర్జున్ రెడ్డి (Arjun Reddy)సినిమాతో యువతలో ఫుల్ క్రేజ్ దక్కించుకుంది హీరోయిన్ షాలిని పాండే (Shalini Pandey). ఈ బ్యూటీ అందం, అభినయం, నటనతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసిందనడంలో అతిశయోక్తిలేదు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో.. షాలినికి వరుసగా ఒకటో, రెండు సినిమా అవకాశాలు వచ్చాయంతే. తర్వాత తెలుగులో పెద్దగా సినిమా అవకాశాలు రాకపోవడంతో ఈ హీరోయిన్ కోలీవుడ్‌కు చెక్కేసింది. జీవీ ప్రకాశ్ (Jeevee Prakash) సరసన కథానాయికగా నటించి.. ప్రేక్షకుల ఆదరణ పొందింది.
అంతేకాకుండా తమిళంలో రీమేక్ చేసిన 100 % లవ్ మూవీలో తమన్నా భాటియా (Tamannaah Bhatia)పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించింది. హిందీలో రణ్‌వీర్ సింగ్ (Ranveer Singh) సరసన జయేష్ భాయ్ జోర్దార్ (Jayesh Bhai Jordar) అనే సినిమాలో కూడా నటించి మెప్పించింది. ఇకపోతే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ తరచూ తన అందచందాలతో నెటిజన్లను కట్టిపడేస్తుంటుంది. ఇదంతా పక్కన పెడితే...
ఓ ఇంటర్వ్యూకు హాజరైన షాలిని పాండే సంచలన కామెంట్స్ చేసింది. కెరీర్‌లో తను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ గురించి చెప్పుకొచ్చింది. ఓ మూవీ షూటింగ్ సమయంలో కారవాన్‌లో డ్రెస్ ఛేంజ్ చేసుకుంటున్నప్పుడు అనుమతి లేకుండా ఓ డైరెక్టర్ వచ్చి డోర్ తీశాడని తెలిపింది. ఆ క్షణం చాలా కోపం వచ్చిందని.. కేకలు వేశానని వెల్లడించింది. దీంతో ఆ దర్శకుడు వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయాడని షాలిని చెప్పింది.
ఇక అక్కడున్నవారంతా అలా కోపంగా అరవడం సరైంది కాదని అన్నారు. చుట్టున్నవాళ్లు అలా అనడంతో తనకు కూడా తప్పుగా అనిపించలేదని వెల్లడించింది. ఇక తర్వాత ఇంకెప్పుడూ అలాంటి పరిస్థితులు ఎదురు కాలేదని తెలిపింది. ఒకవేళ అలాంటి సిచ్యూవేషన్స్ వచ్చినా.. ఎదుటివారిపై ఆగ్రహం వ్యక్తం చేయకుండా ఎలాంటి సమాధానం చెప్పాలో తెలుసుకున్నానని షాలిని ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.