Raashi Khanna: ట్రైనర్‌తో కలిసి జిమ్‌లో రాశిఖన్నా.. ఏడవకుండా బయటపడ్డానంటూ పోస్ట్..?
టాలీవుడ్ బ్యూటీ రాశీఖన్నా (Raashi Khanna) రోజూ జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూ చెమటలు చిందిస్తుంది.

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ బ్యూటీ రాశీఖన్నా (Raashi Khanna) రోజూ జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూ చెమటలు చిందిస్తుంది. తాజాగా నేడు జిమ్‌లో తన ట్రైనర్‌తో కలిసి దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో తన అభిమానులతో పంచుకుంది. ఈ ఫొటోలకు రాశీ ఖన్నా ఓ క్యాప్షన్ కూడా జోడించింది. ‘‘ నేను ఏడవకుండా సెషన్ నుంచి బయటపడ్డాను. సెల్ఫీలు తీసుకునేంత అందంగా అనిపించింది’’ అని రాసుకొచ్చింది.
నాజుకు నడుము అందాలు చూపిస్తోన్న రాశీ ఖన్నా లేటెస్ట్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా ఫ్యాన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. తన ట్రైనర్ ఓకే అని సింబల్‌తో స్టిల్ ఇవ్వగా.. ఈ భామ అతడిపై చేయి వేసి స్టన్నింగ్ ఫొటోకు ఫోజులిచ్చారు. మొత్తానికి వీరిద్దరి ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇకపోతే రాశీ సినిమాల విషయానికొస్తే.. రాశీ ఖన్నా ఊహలు గుసగుసలాడే..
జోరు, జిల్, బెంగాల్ టైగర్ (Bengal Tiger), సుప్రీమ్ (Supreme), హైపర్, జై లవ కుశ, తొలి ప్రేమ, వెంకీ మామ, ప్రతి రోజు పండగే, వరల్డ్ ఫేమస్ లవర్, సర్దార్ (Sardar), తుగ్లక్ దర్బార్, పక్కా కమర్షియల్, థ్యాంక్యూ, తిరుచిత్రంబలం (Tiruchitambalam), యోధా వంటి సినిమాల్లో నటించి ప్రేక్షకుల మనసు దోచేసింది. వీటితో పాటుగా మద్రాస్ కాఫీ (హిందీ), అడంగ మారు (తమిళ), ఇమైక్కా నొడిగల్ (తమిళ), ఫర్జీ (వెబ్ సిరీస్), రుద్ర: ది ఎడ్జ్ ఆఫ్ డార్క్‌నెస్ (వెబ్ సిరీస్), అరణ్మనై 3 (తమిళ), ది సబర్మతి రిపోర్ట్ (హిందీ), భ్రమమ్ (తమిళ)వంటి ఇతర భాషల్లో కూడా నటించి జనాల మెప్పు పొందింది.