వార్నర్‌ను పొట్టు పొట్టు తిట్టిన రాజేంద్ర ప్రసాద్.. డేవిడ్ రియాక్షన్ ఇదేనంటూ వెంకీ షాకింగ్ కామెంట్స్

టాలీవుడ్ హీరో నితిన్(Nithin), శ్రీలీల (Sree Leela)కాంబోలో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘రాబిన్‌హుడ్’(Robinhood).

Update: 2025-03-25 07:34 GMT
వార్నర్‌ను పొట్టు పొట్టు తిట్టిన రాజేంద్ర ప్రసాద్.. డేవిడ్ రియాక్షన్ ఇదేనంటూ వెంకీ  షాకింగ్ కామెంట్స్
  • whatsapp icon

దిశ, సినిమా:  టాలీవుడ్ హీరో నితిన్(Nithin), శ్రీలీల (Sree Leela)కాంబోలో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘రాబిన్‌హుడ్’(Robinhood). వెంకీ కుడుముల(Venky Kudumula) దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్స్‌పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్(Ravi Shankar) నిర్మిస్తున్నారు. అయితే ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌కు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో స్టార్ క్రికెటర్ డెవిడ్ వార్నర్(David Warner), వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్(Rajendra Prasad) కీలక పాత్రలో కనిపించనున్నారు. అయితే ‘రాబిన్‌హుడ్’మూవీ మార్చి 28న థియేటర్స్‌లో విడుదల కాబోతుంది.

ఈ నేపథ్యంలో.. తాజాగా, మూవీ మేకర్స్ మార్చి 23న హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమానికి హాజరైన నటుడు రాజేంద్ర ప్రసాద్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ‘‘వెంకీ, నితిన్ కలిసి డేవిడ్ వార్నర్‌ను పట్టుకొచ్చారు.. వాడు క్రికెట్ ఆడమంటే పుష్ప స్టెప్పులు వేస్తున్నాడు.. రేయ్ వార్నర్.. దొంగ ముండా కొడుకు.. రేయ్ వార్నర్.. ఇదే వార్నింగ్.. రాబిన్ హుడ్ లాంటి చిత్రాలు ఇంకెన్నో చేయాలని, వెంకీ లాంటి దర్శకులతో మళ్లీ నటించాలని అనుకుంటున్నాను’’ అని చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వివాదాస్పదమైన విషయం తెలిసిందే. దీంతో డేవిడ్ వార్నర్ హర్ట్ అయినట్లు మూవీ నుంచి తప్పుకుంటున్నాడనే వార్తలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో.. తాజాగా, వెంకీ రియాక్ట్ అయ్యారు. ‘‘వార్నర్‌కు తెలుగు సరిగ్గా రాదు కాబట్టి అర్థం కాకపోవచ్చు. కానీ నేను అతనికి ముందే చెప్పాను. అవి సరదా మాటలే.. నువ్వు ఫీల్ అవ్వద్దు అన్నాను. వార్నర్ కూల్ పర్సన్ అని అన్నారనటి అంటే.. దానికి ఆయన ‘‘క్రికెట్‌లో ఎన్నో స్లెడ్డింగ్‌లు చూశాను. ఇది యాక్టింగ్‌లో ఫన్‌గా అనిపించింది. ఆయన ఒక పెద్దవారు సరదాగా మాట్లాడారు నేను ఏం బాధపడటం లేదు’’ అని అన్నట్లు తెలిపారు. దీంతో ఈ వివాదానికి చెక్ పడినట్లు అయింది.

Tags:    

Similar News