నువ్వు చాలా లావుగా ఉన్నావు అని హేళన చేసేవారు.. దాని వల్ల డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయా.. ఎన్టీఆర్ భార్య ఎమోషనల్ కామెంట్స్
ఇండస్ట్రీలో రాణించాలంటే టాలెంట్‌తో పాటు అందం కూడా చాలా ముఖ్యం. అందులో హీరోయిన్స్‌కి అయితే మెయిన్‌గా ఉండాల్సిందే అందం అనే చెప్పాలి.

దిశ, వెబ్‌డెస్క్: ఇండస్ట్రీలో రాణించాలంటే టాలెంట్‌తో పాటు అందం కూడా చాలా ముఖ్యం. అందులో హీరోయిన్స్‌కి అయితే మెయిన్‌గా ఉండాల్సిందే అందం అనే చెప్పాలి. అయితే చాలా మందికి టాలెంట్ ఉన్నప్పటికీ లావుగా ఉండటం వల్ల అవకాశాలు కోల్పోతుంటారు. బరువు తగ్గడం కోసం డైట్, జిమ్‌లు అని తెగ కష్టపడి ఫైనల్‌గా మంచి రిజల్ట్ తెచ్చుకుని ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకునే బ్యూటీ కూడా కెరీర్ స్టార్టింగ్‌లో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నదట. అంతేకాకుండా తనను బాడీ షేమింగ్ చేయడంతో డిప్రెషన్ లోకి వెళ్లిపోయిందట. ఇక ఆ ట్రోలింగ్స్‌నే ఆయుధంగా మార్చుకుని సన్నగా మారి నేడు ఇండస్ట్రీలో రాణిస్తుంది. మరి ఇంతకీ ఈ ముద్దుగుమ్మ ఎవరు ఏంటి విషయాలు అనేది ఇప్పుడు మనం చూద్దాం..
యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR), కొరటాల శివ(Koratala Siva) దర్శకత్వంలో వచ్చిన ‘దేవర’(Devara) మూవీ ఎంతగా విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్(Janhvi Kapoor) హీరోయిన్‌గా నటించింది. అయితే ఇందులో మరాఠీ బ్యూటీ శృతి మరాఠే(Shruti Marathe) కూడా నటించిన సంగతి తెలిసిందే. ఇంతకీ ఆమె ఎవరనుకుంటున్నారా అదేనండి దేవరకు భార్యగా యాక్ట్ చేసిన బ్యూటీ. ఈ భామ తన అందం, అభినయంతో ఆడియన్స్ హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.
అలాగే నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రుతి మరాఠే బరువు కారణంగా తరచుగా ట్రోలింగ్ ఎదుర్కొన్నానంటూ ఎమోషనల్ కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. ‘జనాలు మీ శరీరాన్ని నిరంతరం విమర్శిస్తారు. ఒకప్పుడు నన్ను కూడా.. ‘నువ్వు చాలా లావుగా ఉన్నావు’ అని అనేవారు, అది నన్ను బాగా ఒత్తిడికి గురి చేసింది. కానీ ఇప్పుడు ‘నువ్వు ఎంత సన్నగా మారిపోయావు’ అని అంటున్నప్పుడు నవ్వొస్తుంది.
ఎందుకంటే గత 15-20 సంవత్సరాలుగా ఇవే మాటలు వింటున్నాను. మీరు లోపల ఎలా భావిస్తున్నారో, మీకు ఏవైనా సమస్యలు ఉన్నాయా అని ఆలోచించకుండా ప్రజలు మీ శరీరం గురించి మాట్లాడుతూనే ఉంటారు. అది మీ మానసిక ఆరోగ్యంపై పెద్ద ప్రభావాన్ని చూపిస్తుంది. కానీ ఇప్పుడు నేను ఆ విమర్శలను అసలు పట్టించుకోను. మీరు మిమ్మల్ని ప్రేమించండి. మీపై మీరు నమ్మకంగా ఉండండి’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Read More..
నేచర్, యనిమల్, గుడ్ వైబ్స్ అంటూ క్యూట్ ఫొటోస్ షేర్ చేసిన సమంత.. పోస్ట్ వైరల్