'రామమందిరం' వాచ్ ధ‌రించిన స‌ల్మాన్... ఎన్ని లక్షలు అంటే ?

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ( Salman Khan) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్ తో పాటు మన టాలీవుడ్ ఇ

Update: 2025-03-28 03:07 GMT
రామమందిరం వాచ్ ధ‌రించిన స‌ల్మాన్... ఎన్ని లక్షలు అంటే ?
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ( Salman Khan) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్ తో పాటు మన టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా మంచి క్రేజ్ దక్కించుకున్నాడు కండల వీరుడు సల్మాన్ ఖాన్. అయితే తాజాగా సల్మాన్ ఖాన్ చేసిన పనికి... అతని ఫాన్స్ అందరూ మెచ్చుకుంటున్నారు. దీనికి కారణం రామ జన్మభూమి ( Rama JanmaBhumi) ఎడిషన్ వాచ్ తో (Watch) సల్మాన్ ఖాన్ మెరవడమే. ముస్లిం మతానికి సంబంధించిన సల్మాన్ ఖాన్... రామ జన్మభూమి ఎడిషన్ వాచ్ పెట్టుకున్నాడు. ఈ ఫోటోలు స్వయంగా సల్మాన్ ఖాన్ షేర్ చేశారు. దాదాపు 34 లక్షలు విలువ చేసే ఈ లిమిటెడ్ ఎడిషన్ వాచ్.. ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఈ ఫోటోలను షేర్ చేసిన నేపథ్యంలో.... ఈనెల 30న థియేటర్ లో కలుసుకుందామని... సల్మాన్ ఖాన్ తన ఫ్యాన్స్ కు పిలుపునిచ్చాడు.

సల్మాన్ ఖాన్ ఇటీవల సికిందర్ సినిమా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్స్ విపరీతంగా చేస్తున్నాడు సల్మాన్ ఖాన్. ఇందులో భాగంగానే రామ జన్మభూమి ఎడిషన్ వాచ్ ధరించి... ఫాన్స్ ను ఆకట్టుకున్నాడు. ఇది ఇలా ఉండగా సల్మాన్ ఖాన్ పెట్టుకున్న ఈ వాచ్ లో శ్రీరాముడు, హనుమంతుడు అలాగే అయోధ్య రామాలయం డిజైన్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే.. ముస్లిం అయి ఉండి సల్మాన్ ఖాన్ ఇలా రామ మందిరానికి సంబంధించిన వాచ్ ధరించడం పై బిజెపి ( BJP ) శ్రేణులు మండిపడుతున్నాయి. తమ హిందూ దేవాలయాన్ని సినిమా ప్రమోషన్స్ కోసం వాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read More..

రాబిన్ హుడ్ ట్విట్టర్ రివ్యూ... వణికించిన వార్నర్ ! 

Tags:    

Similar News