పవన్ కల్యాణ్ - MS ధోనీ పోస్టర్ రిలీజ్ చేసిన సుమ, తమన్.. రెండు కళ్లు సరిపోవట్లేదంటున్న ఫ్యాన్స్

టీమిండియా(Team India) మాజీ కెప్టెన్ ఎమ్ఎస్ ధోనీ(MS Dhoni), ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌‌(Pawan Kalyan)లను ఇద్దరినీ ఇష్టపడే కంబైన్డ్ ఫ్యాన్స్ అనేకమంది ఉన్నారు.

Update: 2025-03-22 15:24 GMT
పవన్ కల్యాణ్ - MS ధోనీ పోస్టర్ రిలీజ్ చేసిన సుమ, తమన్.. రెండు కళ్లు సరిపోవట్లేదంటున్న ఫ్యాన్స్
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా(Team India) మాజీ కెప్టెన్ ఎమ్ఎస్ ధోనీ(MS Dhoni), ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌‌(Pawan Kalyan)లను ఇద్దరినీ ఇష్టపడే కంబైన్డ్ ఫ్యాన్స్ అనేకమంది ఉన్నారు. ఈ ఇద్దరిలో ఎవరికి సంబంధించిన వార్తలు వెలుగులోకి వచ్చినా ఇద్దరి ఫ్యాన్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంటారు. ముఖ్యంగా వీరి బర్త్ డేలు వస్తే పోస్టర్లు, వీడియోలు ఎడిట్ చేస్తూ తెగ వైరల్ చేస్తుంటారు. తాజాగా వీరిద్దరి అభిమానులకు టాలీవుడ్ యాంకర్ సుమ కనకాల(Suma Kanakala), మ్యూజిక్ డైరెక్టర్ తమన్(Thaman) శుభవార్త చెప్పారు. ఐపీఎల్ ప్రారంభం కాబోతున్న వేళ వపన్ కల్యాణ్ ఫ్యాన్స్ తరపున చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆల్‌ ద బెస్ట్ చెబుతూ సుమ, తమన్ సోషల్ మీడియాలో పోస్టర్ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. చూడ్డానికి రెండు కళ్లు సరిపోవట్లేదంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

మరోవైపు.. మెగా హీరో వరుణ్ తేజ్(Varun Tej) కూడా ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ తరపున సన్ రైజర్స్ హైదరాబాద్‌(Sunrisers Hyderabad) జట్టుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన కూడా కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు.

ఇదిలా ఉండగా.. పవన్ కల్యాణ్ ప్రతిష్టాత్మక పాన్ ఇండియా సినిమా హరిహర వీరమల్లు(Hari Hara Veera Mallu) మే 9వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు జ్యోతికృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించగా, నిధి అగర్వాల్(Nidhhi Agerwal) హీరోయిన్‌గా నటిస్తోంది. ఏఎమ్ రత్నం నిర్మిస్తున్నారు.

Tags:    

Similar News

Monami Ghosh