బ్రేకప్ రూమర్స్.. విజయ్ వర్మ కోట్‌ను ధరించిన తమన్నా.. మళ్లీ కలిసిపోయారా అంటున్న ఫ్యాన్స్

మిల్క్ బ్యూటీ తమన్నా(Thamanna) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ‘ఓదెల-2’(Odela-2) సినిమాలో నటిస్తోంది. ఇది సూపర్ హిట్ ‘ఓదెల రైల్వే స్టేషన్‌’(Railway Station)కు సీక్వెల్‌గా వస్తున్న మూవీ.

Update: 2025-03-19 05:01 GMT
బ్రేకప్ రూమర్స్.. విజయ్ వర్మ కోట్‌ను ధరించిన తమన్నా.. మళ్లీ కలిసిపోయారా అంటున్న ఫ్యాన్స్
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: మిల్క్ బ్యూటీ తమన్నా(Thamanna) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ‘ఓదెల-2’(Odela-2) సినిమాలో నటిస్తోంది. ఇది సూపర్ హిట్ ‘ఓదెల రైల్వే స్టేషన్‌’(Railway Station)కు సీక్వెల్‌గా వస్తున్న మూవీ. ఇక రీసెంట్‌గా ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్(Teaser) మూవీపై మరింత క్యూరియాసిటీని పెంచేశాయి. అలాగే మరోపక్క ఐటెమ్ సాంగ్స్‌లో డ్యాన్స్ చేస్తూ తన అందాలతో వావ్ అనిపిస్తుంది.

ఇక ఈ భామ వ్యక్తిగత విషయానికి వస్తే.. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ(Vijay Varma)తో మొన్నటి వరకు పీకల్లోతు ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ జంట తాజాగా బ్రేకప్ చెప్పుకున్నారని, ఒకరి ఫొటోలు మరొకరు డిలీట్ చేసుకున్నారని చాలా రూమర్స్ సోషల్ మీడియాలో వస్తున్నాయి. అయితే వీటిపై వీరిద్దరూ స్పందించకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఈ జంటకు సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వివరాల్లోకి వెళితే..

రీసెంట్‌గా తమన్నా తన ఫ్రెండ్ అయినటువంటి రాషా తడాని(Rasha Thadani) పుట్టినరోజు వేడుకకు హాజరయ్యారు. ఇక పార్టీకి ఈ భామ బ్లాక్ అండ్ వైట్ లైన్స్‌తో ఉన్న వన్ పీస్ కోటును ధరించింది. ఈ అవుట్ ఫిట్‌లో తమన్నా స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. కానీ, ఈ పార్టీలో ఈ బ్యూటీ వేసుకున్న కోట్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఎందుకంటే తమన్నా వేసుకున్న కోట్ విజయ్ కోట్ అని చర్చించుకుంటున్నారు. కాగా అంతకుముందు వీరిద్దరు కలిసి ఉన్న తరుణంలో విజయ్ ఆ కోట్‌తో దర్శనమిచ్చారు. దీంతో మీరు మళ్లీ కలిసిపోయారా అంటూ నెటిజన్లు, ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

Read More..

Kaalamega Karigindi: దరీ దాటిన మోహం దేహమే కదా.. ఆకట్టుకుంటోన్న ఫీల్ గుడ్ లవ్ సాంగ్  


Full View

Tags:    

Similar News

Meenaakshi Chaudhary