‘అదిదా సర్‌ప్రైజ్’స్టెప్‌పై స్పందించిన నితిన్.. వారికి లేని సమస్య మీకెందుకంటూ షాకింగ్ కామెంట్స్

గత కొద్ది రోజుల నుంచి ఎక్కడా చూసినా ‘అదిదా సర్‌ప్రైజ్’(Adhi Dha Surprisu) కనిపిస్తుందనడంలో అతిశయోక్తి లేదు.

Update: 2025-03-21 06:08 GMT
‘అదిదా సర్‌ప్రైజ్’స్టెప్‌పై స్పందించిన నితిన్.. వారికి లేని సమస్య మీకెందుకంటూ షాకింగ్ కామెంట్స్
  • whatsapp icon

దిశ, సినిమా: గత కొద్ది రోజుల నుంచి ఎక్కడా చూసినా ‘అదిదా సర్‌ప్రైజ్’(Adhi Dha Surprisu) కనిపిస్తుందనడంలో అతిశయోక్తి లేదు. సోషల్ మీడియాను మొత్తం ఈ పాట షేక్ చేస్తోంది. చిన్న పిల్ల కానుంచి యూట్యూబర్స్, సెలబ్రిటీలు సైతం ‘అదిదా సర్‌ప్రైజ్’(Adhi Dha Surprisu)సాంగ్‌కు రీల్స్ చేస్తున్నారు. నెట్టింట మొత్తం ఈ పాట మార్మోగిపోతుందనే చెప్పాలి. అయితే ఈ సాంగ్‌ను కొంతమంది అమ్మాయిలు కూడా అచ్చం కేతిక శర్మ(Ketika Sharma) లాగా గెటప్ వేసుకుని రీల్స్ చేయడంతో ఈ వీడియోలు కాస్త నెట్టింట వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. దీంతో కొంతమంది నెటిజన్లు వారిపై విమర్శలు చేస్తున్నారు.

ఏంది ఈ చెండాలం మీకేం పోయేకాలం వచ్చిందని తిడుతున్నారు. ఈ నేపథ్యంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నితిన్ ఈ విమర్శలపై స్పందించి షాకింగ్ కామెంట్స్ చేశారు. ‘‘అదిదా సర్‌ప్రైజ్ .. సాంగ్ స్టెప్ చూసే పద్దతిలో ఉంటుంది ఏమో నాకు తెలీదు కానీ .. అందులో స్కిన్ షో లేదు. పాట మొతం లో ఒక్క షాట్ బ్యాడ్ గా లేదు. ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా మంది ఆ మల్లెపూల కాస్టూమ్‌లోనే రీల్స్ చేస్తున్నారు. ఆడవాళ్లకి లేని సమస్య మనకి ఏంటి చెప్పండి!!" అని అన్నారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారడం అంతా షాక్ అవుతున్నారు.

మరికొందరు మాత్రం నితిన్‌పై మండిపడుతున్నారు. అలాంటి దారుణాల గురించి అలా మాట్లాడమేంటని అంటున్నారు. కాగా, నితిన్, శ్రీలీల జంటగా నటిస్తున్న ‘రాబిన్‌హుడ్’సినిమాలోని పాటనే ‘అదిదా సర్‌ప్రైజ్’ సాంగ్. వెంకీ కుడుముల (Venky Kudumula)దర్శకత్వంలో రాబోతున్న ఈ మూవీలో రాజేంద్ర ప్రసాద్(Rajendra Prasad) కీలక పాత్రలో నటిస్తున్నారు. అయితే ఈ సినిమా మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers) బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, రవి శంకర్(Ravi Shankar) భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అయితే ఇందులో భారత స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్(David Warner) కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆయనకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల కావడంతో అందరిలో మూవీపై అంచనాలు పెరిగిపోయాయి. 

Read More..

స్పోర్ట్స్ బ్యాక్‌గ్రౌండ్‌లో భారీ సినిమా చేయనున్న నితిన్.. డైరెక్టర్ ఎవరంటే?  


 Full View

(video Credit to Sony Music South YouTube Chanel)

Tags:    

Similar News