స్పోర్ట్స్ బ్యాక్‌గ్రౌండ్‌లో భారీ సినిమా చేయనున్న నితిన్.. డైరెక్టర్ ఎవరంటే?

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్(Nithin) ‘రాబిన్‌హుడ్’(Robinhood) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

Update: 2025-03-21 05:29 GMT
స్పోర్ట్స్ బ్యాక్‌గ్రౌండ్‌లో భారీ సినిమా చేయనున్న నితిన్.. డైరెక్టర్ ఎవరంటే?
  • whatsapp icon

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో నితిన్(Nithin) ‘రాబిన్‌హుడ్’(Robinhood) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రానికి వెంకీ కుడుముల(Venky Kudumula) దర్శకత్వం వహిస్తుండగా.. ఇందులో శ్రీలీల (Sreeleela)హీరోయిన్‌గా నటిస్తోంది. దీనిని ప్రముఖ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇందులో సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్(Rajendra Prasad) కీలక పాత్రలో నటిస్తున్నాడు. అయితే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ‘రాబిన్‌హుడ్’మూవీ మార్చి 28న థియేటర్స్‌లోకి రానుంది.

అయితే ఈ సినిమాతో పాటు నితిన్ తమ్ముడు, వేణు యెల్దండి దర్శకత్వంలో ‘ఎల్లమ్మ’ వంటి మూవీస్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా, నితిన్ ఓ భారీ ప్రాజెక్ట్ చేయనున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ సినిమాకు విక్రమ్ కె కుమార్(Vikram K Kumar) దర్శకత్వం వహించనున్నారట. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో రాబోతున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నట్లు టాక్. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ నితిన్ సినిమాకు సంబంధించిన పోస్ట్ మాత్రం అందరిలో ఆసక్తిని పెంచుతోంది. అయితే వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘ఇష్క్’ బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి హిట్ కాంబో రిపీట్ అవుతుండటం విశేషం.

Tags:    

Similar News

Nivetha Thomas