Mrunal Thakur: రిలేషన్‌షిప్ పై మృణాల్ ఠాకూర్ ఇంట్రెస్టింగ్ పోస్ట్.. వీడియోతో హింట్ ఇచ్చినట్టేనా!

యంగ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) అందరికీ సుపరిచితమే. ఈ అమ్మడు ‘సీతారామం’(Sita Ramam) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అందరినీ మెస్మరైజ్ చేసింది.

Update: 2025-03-28 07:02 GMT
Mrunal Thakur: రిలేషన్‌షిప్ పై మృణాల్ ఠాకూర్ ఇంట్రెస్టింగ్ పోస్ట్.. వీడియోతో హింట్ ఇచ్చినట్టేనా!
  • whatsapp icon

దిశ, సినిమా: యంగ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) అందరికీ సుపరిచితమే. ఈ అమ్మడు ‘సీతారామం’(Sita Ramam) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అందరినీ మెస్మరైజ్ చేసింది. సాంప్రదాయ లుక్‌లో కనిపించిన ఆమె సీత పాత్రలో నటించి తన అందం, నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan)హీరోగా నటించిన ఈ సినిమా 2022లో వచ్చి అన్ని భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్‌ కావడంతో మృణాల్ ఓ వర్ నైట్ స్టార్‌గా మారిపోయింది. దీంతో ఈ అమ్మడుకి వరుస అవకాశాలు వరించాయి. ఈ తర్వాత పలు చిత్రాల్లో నటించిన మృణాల్ ‘హాయ్ నాన్న’తో మరోసారి ఘన విజయం సాధించింది. గత ఏడాది ‘కల్కి’(Kalki) మూవీలో కీలక పాత్రలో నటించి మెప్పించింది. ప్రస్తుతం ‘డెకాయిట్’ (Dacoit)చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఇందులో అడివి శేష్ (Adivi Sesh) హీరోగా నటిస్తుండగా.. ఇందుకు సంబంధించిన అప్డేట్స్ అన్ని క్యూరియాసిటీని పెంచాయి. మృణాల్ ఓ వైపు షూటింగ్‌లో పాల్గొంటూనే మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటోంది. తాజాగా, ఈ భామ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వరుస పోస్టులు షేర్ చేసింది. అయితే ఇందులో రిలేషన్‌షిప్‌పై, డేటింగ్‌పై ఓ వ్యక్తి పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతున్న వీడియో కూడా ఉంది. అసలు అందులో దేని గురించి ఉందంటే.. ‘‘బ్రేకప్ అయితే అన్ని అయిపోయిందని బాధ పడకూడదు. మనం మన లైఫ్‌ని బిల్డ్ చేసుకోవాలి. రిలేషన్ షిప్ ఒకటే కాదు లైఫ్‌లో పేరెంట్స్ ఉన్నారు. వాళ్ల కంటే ఎక్కువ ఏదీ కాదు మనకి. నేను అయితే నా లైఫ్‌ను ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది నేర్చుకున్నాను’’ అని ఉంది. ఇక అది చూసిన నెటిజన్లు పలు రకాలుగా రిలేషన్‌షిప్‌పై హింట్ ఇచ్చినట్టేనా అని చర్చించుకుంటున్నారు. అలాగే ఆమె ఎవరితో లవ్‌లో పడింది బ్రేకప్ ఎప్పుడు అయిందా? అని అంతా అయోమయంలో పడిపోయారు. 

Read More..

బంపర్ ఆఫర్ అందుకున్న ఫరియా అబ్దుల్లా.. అదృష్టం అంటే ఇదే అంటున్న నెటిజన్లు  


 

Tags:    

Similar News