Demonty Colony Part-3: ఆ హారర్ సినిమా పార్ట్ 3.. అఫీషియల్ పోస్ట్‌తో ఆనందంలో నెటిజన్లు

అరుల్ నిధి (Arul Nidhi), ప్రియ భవానీ శంకర్ (Priya Bhavani Shankar) జంటగా నటించిన బ్లాక్ బస్టర్ హారర్ థ్రిల్లర్ (Horror thriller) చిత్రం ‘డీమోంటీ కాలనీ 2’

Update: 2025-04-02 14:26 GMT
Demonty Colony Part-3: ఆ హారర్ సినిమా పార్ట్ 3.. అఫీషియల్ పోస్ట్‌తో ఆనందంలో నెటిజన్లు
  • whatsapp icon

దిశ, సినిమా: అరుల్ నిధి (Arul Nidhi), ప్రియ భవానీ శంకర్ (Priya Bhavani Shankar) జంటగా నటించిన బ్లాక్ బస్టర్ హారర్ థ్రిల్లర్ (Horror thriller) చిత్రం ‘డీమోంటీ కాలనీ 2’ (Demonty Colony-2). జ్ఞానముత్తు పట్టరై, వైట్‌నైట్స్ ఎంటర్‌టైన్మెంట్స్‌తో కలిసి రాజ్ వర్మ ఎంటర్‌టైన్మెంట్, శ్రీ బాలాజీ ఫిలింస్ నిర్మించిన ఈ చిత్రానికి విజయ సుబ్రహ్మణ్యం, ఆర్.సి.రాజ్ కుమార్ నిర్మాతలుగా వ్యవహరించారు. దర్శకుడు అజయ్ ఆర్ జ్ఞానముత్తు రూపొందించిన ఈ చిత్రం ఫస్ట్ తమిళంలో రిలీజై మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత తెలుగు ఆడియన్స్ ముందుకు వచ్చి ఇక్కడ కూడా సక్సెస్ అందుకుంది.

ఇదిలా ఉంటే.. హారర్ అండ్ థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకున్న డీమోంటీ కాలనీ పార్ట్-త్రీ (Demonty Colony Part-3) కి సంబంధించిన తాజాగా మరో అప్‌డేట్ వచ్చింది. పార్ట్-2 ప్రమోషన్స్ టైమ్‌లో లోనే డీమోంటీ కాలనీ 3 కూడా ఉంటుందని, ఈ మూడో పార్ట్‌ 2026లో విడుదల అవుతుందని అప్పుడే ప్రకటించిన చిత్ర బృందం తాజాగా మరో అప్‌డేట్ ఇచ్చారు. షూటింగ్ పార్ట్ నుంచి ఓ ఫొటో షేర్ చేస్తూ ‘డీమోంటీ కాలనీ 3 వర్క్ జరుగుతోంది’ అనే క్యాప్షన్ ఇచ్చారు. ప్రజెంట్ ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. వెయిటింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

Similar News