ఇంజెక్షన్ వల్లే ఇలా మారిపోయావంటూ నెటిజన్ పోస్ట్.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన స్టార్ హీరోయిన్ (ట్వీట్)

ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఖుష్బూ సుందర్(Khushboo Sundar) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

Update: 2025-04-16 06:28 GMT
ఇంజెక్షన్ వల్లే ఇలా మారిపోయావంటూ నెటిజన్ పోస్ట్.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన స్టార్ హీరోయిన్ (ట్వీట్)
  • whatsapp icon

దిశ, సినిమా: ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఖుష్బూ సుందర్(Khushboo Sundar) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గతంలో తమిళ, తెలుగు భాషల్లో పలు చిత్రాల్లో నటించి మెప్పించిన ఆమె ఎన్నో హిట్స్ తన ఖాతాలో వేసుకుంది. హీరోయిన్‌గానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానూ నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. అలాగే రాజకీయాల్లోనూ రాణిస్తోంది. దీంతో కొద్ది రోజులపాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ఖుష్బూ గత ఏడాది ‘వన్‌వాస్’ (Vanvaas)మూవీతో ప్రేక్షకులను అలరించింది. అయితే ఆమె ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. నిత్యం తన భర్త సుందర్ తెరకెక్కిస్తున్న సినిమాల గురించి వెల్లడిస్తోంది.

ఇదిలా ఉంటే.. తాజాగా, ఖుష్బూ తన ట్విట్టర్ ద్వారా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. ఇందులో ఆమె గ్రీన్ కలర్ మోడ్రన్ డ్రెస్ వేసి సన్నగా కనిపించింది. అంతేకాకుండా ఫ్రీ హెయిర్‌తో స్లిమ్ లుక్‌లో ఉంది. ఇక ఈ పోస్ట్‌కు ‘‘ఐయామ్ బ్యాక్ టు ద ఫ్యూచర్’’ అనే క్యాప్షన్ జత చేసింది. దీంతో వాటిని చూసిన నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. ‘బొద్దుగా ఉండే నువ్వు ఇలా సన్నగా మారిపోవడానికి ముంజార ఇంజెక్షన్స్ వేసుకున్నావ్ కదా.

వాటి గురించి నిన్ను చూసే నీ ఫాలోవర్స్‌కు కూడా చెప్పండి.. నీలాగ ఇంజెక్షన్లు వాడాలనుకుంటారు’ అని పోస్ట్ పెట్టాడు. ఇక అది చూసిన ఖుష్బూ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది. ‘‘మీరు ఎలాంటి మనుషులు? మీరేప్పుడు మీ ముఖాలను సోషల్ మీడియాలో చూపించరు. ఎందుకంటే మీరు అంత అసహ్యంగా ఉంటారు. మీ తల్లిదండ్రులను చూస్తుంటే జాలి వేస్తోంది’’ అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఖుష్బు ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Tags:    

Similar News

Archana Singh Rajput