ఆ సినిమా 50 ఏళ్ల కష్టానికి ఫలితాన్నిచ్చింది.. తెలుగు నటుడు ఎమోషన్

తెలుగు మూవీ(Telugu Movies) లవర్స్‌కు సీనియర్ నటుడు బబ్లూ పృథ్వీరాజ్‌(Bablu Prithviraj) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

Update: 2025-03-17 15:41 GMT
ఆ సినిమా 50 ఏళ్ల కష్టానికి ఫలితాన్నిచ్చింది.. తెలుగు నటుడు ఎమోషన్
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు మూవీ(Telugu Movies) లవర్స్‌కు సీనియర్ నటుడు బబ్లూ పృథ్వీరాజ్‌(Bablu Prithviraj) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అంతకుముందు అనేక సినిమాల్లో నటించినా.. విక్టరీ వెంకటేశ్-ఆర్తి అగర్వాల్ కాంబినేషన్‌లో వచ్చిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ చిత్రంలో బబ్లూ నటనకు అద్భుతమైన మార్కులే పడ్డాయి. ఆ తర్వాత చాలా ఏళ్లు మంచి పాత్రల కోసం మళ్లీ ఎదురుచూశారు.. చివరకు రణ్‌బీర్ కపూర్-సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో వచ్చిన యానిమల్ చిత్రంతో మరోసారి ప్రేక్షకుల దృష్టిని తనవైపునకు తిప్పుకున్నారు బబ్లూ పృథ్వీరాజ్‌. తాజాగా ఆయన కెరియర్‌లో ఎదుర్కొన్న కష్టాల గురించి చెప్పుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు.

నందమూరి హీరో కల్యాణ్‌ రామ్‌, విజయశాంతి ప్రధాన పాత్రల్లో వస్తోన్న ‘అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి’ బబ్లూ కీలక పాత్రలో నటించారు. తాజాగా సినిమా ప్రమోషన్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘ఇండస్ట్రీలో 50 ఏళ్లుగా కొనసాగుతున్నాను. ఎన్నో ఇబ్బందులు పడ్డాను. చాలా ఫెయిల్యూర్స్ చూశాను. కానీ యానిమల్ మూవీ(Animal Movie) తర్వాత నా కెరియర్ మొత్తం మారిపోయింది. ఇప్పుడు ‘అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి’ సినిమాలో కూడా అలాంటి క్యారెక్టరే చేస్తున్నాను. ఇది కూడా నన్ను మరో రేంజ్‌కు తీసుకెళ్తుందని నమ్ముతున్నాను’ అని బబ్లూ పృథ్వీరాజ్‌ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


Tags:    

Similar News