Shanmukha: అందరికి విజయాన్ని అందిస్తుంది.. ‘షణ్ముఖ’పై హైప్ పెంచేస్తున్న పార్లమెంట్‌ సభ్యుడి కామెంట్స్

ఆది సాయికుమార్ (Adi Saikumar), అవికాగోర్ (Avikagore) జంటగా నటిస్తున్న డివోషనల్‌ థ్రిల్లర్‌ ‘షణ్ముఖ’

Update: 2025-03-17 16:15 GMT
Shanmukha: అందరికి విజయాన్ని అందిస్తుంది.. ‘షణ్ముఖ’పై హైప్ పెంచేస్తున్న పార్లమెంట్‌ సభ్యుడి కామెంట్స్
  • whatsapp icon

దిశ, సినిమా: ఆది సాయికుమార్ (Adi Saikumar), అవికాగోర్ (Avikagore) జంటగా నటిస్తున్న డివోషనల్‌ థ్రిల్లర్‌ ‘షణ్ముఖ’ (Shanmukha). షణ్ముగం సాప్పని ద‌ర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సాప్పని బ్రదర్స్ స‌మ‌ర్పణ‌లో తుల‌సీరామ్ సాప్పని, ష‌ణ్ముగం సాప్పని, రమేష్‌ యాదవ్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన అప్‌డేట్ థ్రిల్లింగ్‌గా ఆకట్టుకోగా.. పాజిటివ్ అంచనాల మధ్య ‘షణ్ముఖ’ చిత్రం ఈనెల 21న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధం అవుతోంది. ఇందులో భాగంగా తాజాగా ప్రీరిలీజ్‌ (Prerelease) వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి పార్లమెంట్‌ సభ్యులు రఘునందన్‌ రావు (Raghunandan Rao) ముఖ్య అతిథిగా హాజరయ్యి సినిమాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ‘‘షణ్ముఖ’ ఈ టైటిల్‌లోనే ఎంతో పత్యేకత ఉంది. ఆది కెరీర్‌కు మలుపు తిప్పే సినిమాలా ఉండాలని కోరుకుంటున్నాను. గొప్ప నటుడు సాయికుమార్‌ వారసుడిగా ఆదికి మంచి పేరు ఉంది. ఇందులో నటీనటులకు, సాంకేతిక నిపుణులకు అందరికి ఈ సినిమా మంచి పేరు తీసుకరావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. షణ్ముఖ టైటిల్‌కు తగ్గట్టుగా దర్శకుడు షణ్ముగం ఈ చిత్రం విషయంలో మల్టీ టాలెంటెడ్‌ను చూపించాడు. తప్పకుండా ఈ చిత్రం అందరికి విజయాన్ని అందిస్తుందని నమ్ముతున్నాను’ అని తెలిపారు.

అవికాగోర్‌ మాట్లాడుతూ.. ‘ఈ చిత్రంలో హీరో ఆది డ్యాన్స్‌కు, ఫైటింగ్స్‌కు, నటనకు ఫ్యాన్స్‌తో పాటు అందరూ ఫిదా అవుతారు. రవి బసూర్‌ నేపథ్య సంగీతం ఈచిత్రానికి హైలైట్‌కు ఉంటుంది. అందరూ కష్టపడి మంచి సినిమా చేశాం. అందరూ తప్పకుండా చిత్రాన్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాను’ అని తెలిపింది. ఇక హీరో ఆది మాట్లాడుతూ.. ‘ఈ టైటిల్‌ చాలా పాజిటివ్‌గా ఉందని చెప్పారు. అందరూ కష్టపడి చేసిన మంచి ప్రయత్నం. అవికాతో పనిచేయడం సంతోషంగా ఉంది. రెగ్యులర్ సినిమాలు కూడా అవిక చేయదు. ఆమె పాత్రకు ఎంతో ఇంపార్టెంట్‌ ఉంటుంది. ఈ సినిమా ఓ మంచి ప్రయాణం. అందరూ సినిమాకు విజయాన్నిఅందిస్తారని కోరుకుంటున్నాను’ అన్నారు.


Tags:    

Similar News