‘సికందర్’సినిమాలో సల్మాన్ ఖాన్ భార్యగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. క్యూరియాసిటీ పెంచుతున్న ట్వీట్

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్(Salman Khan), ఏఆర్ మురుగదాస్(AR Murugadoss) కాంబినేషన్‌లో రాబోతున్న తాజా చిత్రం ‘సికందర్’.

Update: 2025-03-21 07:12 GMT
‘సికందర్’సినిమాలో సల్మాన్ ఖాన్ భార్యగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. క్యూరియాసిటీ పెంచుతున్న ట్వీట్
  • whatsapp icon

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్(Salman Khan), ఏఆర్ మురుగదాస్(AR Murugadoss) కాంబినేషన్‌లో రాబోతున్న తాజా చిత్రం ‘సికందర్’. ఈ సినిమాలో టాలీవుడ్ బ్యూటీ రష్మిక మందన్న(Rashmika Mandanna) హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే దీనిని సాజిత్ నదిలవాలా నిర్మించనున్నారు. ఇందులో సత్యరాజ్ (Satyaraj)కీలక పాత్రలో నటిస్తున్నారు. అయితే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా ఈద్ కానుకగా 30 కానుకగా విడుదల కాబోతుంది. ఇప్పటికే ‘సికందర్’ మూవీ నుంచి విడుదలైన అప్డేట్స్ అన్ని మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి.

ఇదిలా ఉంటే.. తాజాగా, ‘సికందర్’ సినిమాలో కాజల్ అగర్వాల్(Kajal Aggarwal) ప్రధాన పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ‘‘యాక్షన్ థ్రిల్లర్ అని అనుకున్నారు. కానీ లవ్ స్టోరీ దాని భావోద్వేగ కేంద్రంగా మారింది. అదేవిధంగా, సికందర్‌లో ఆ ఆశ్చర్యకరమైన అంశం ఉంది - దాని గుండెలో తీవ్రమైన, భార్యాభర్తల కథ. సల్మాన్ ఖాన్ భార్యగా కాజల్’’ నటిస్తున్నట్లు పలు పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట క్యూరియాసిటీని పెంచుతోంది.

Tags:    

Similar News